అందం కోసం, ఆరోగ్యం కోసం ఆకుపచ్చటి నీళ్లు, ఆకుపచ్చటి పేస్ట్ వాడేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇందులోని ముఖ్యపదార్థం క్లోరోఫిల్. దీన్నే ‘పత్రహరితం’ అంటాం. సూర్యరశ్మిని ఉపయోగించి మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడే పిగ్మెంట్ (వర్ణకం) ఇదే. అరుగుదల మెరుగుపడటానికి, శక్తి కోసం, బరువు తగ్గడానికి, నిగారింపుల చర్మం కోసం, తాజా శ్వాస కోసం, శరీర పరిమళం కోసం క్లోరోఫిల్‌ను పేస్ట్, రసం, మాత్రల రూపంలో వినియోగించే ధోరణి పెరుగుతున్నది. క్లోరోఫిల్ వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందనీ, శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల నుంచి విముక్తి లభిస్తుందనీ నిపుణులు చెబుతున్నారు. సహజ క్లోరోఫిల్ ఎక్కువగా ఉండే వీట్‌గ్రాస్, పచ్చి బీన్స్, పాలకూర, బచ్చలికూర, బఠాణీ లాంటి ఆకు పచ్చటి పదార్థాలు తీసుకుంటే మరీ మంచిది.