కండ్లకు లైనర్ అనగానే నల్ల రంగు మాత్రమే ఎంచుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నచ్చిన వర్ణాలను దిద్దుకుంటూ కొత్త స్టయిల్‌కు నాంది పలుకుతున్నది యువత. ప్రస్తుతం నీలిరంగు ఐ లైనర్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నది. నలుపు, గోధుమ, తేనె, నీలం.. అన్ని రంగుల కండ్లకూ బ్లూ ఐలైనర్ నప్పుతుంది. లైనర్‌తో పాటు ఐషాడోకు కూడా నీలిరంగునే వాడొచ్చు. గోల్డ్, గ్రే, బ్రౌన్ కలర్ షాడోలకూ బ్లూ లైనర్ బాగుంటుంది. ముందుగా బ్లాక్ లైనర్‌తో వాటర్ లైన్ ఇచ్చుకోవచ్చు. తర్వాత నేవీ లేదా ఆకాశపు నీలిరంగు లైనర్ను బ్లాక్ లైన్ కిందిభాగంలో వేయాలి. కనురెప్పల మీద కూడా అదేవిధంగా చేయాలి. లైనింగ్‌ను కండ్లు దాటి కూడా బయటికి వేయవచ్చు. అక్కడక్కడ చిన్నచిన్న స్ట్రోక్స్ ఇస్తే మేకప్ అదిరిపోతుంది.