వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్లు, నెలసరి సమస్యలు ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించినప్పుడు.. స్వీయ పరీక్షకు అనువుగా ఉండే పరికరాలు, యాప్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కొన్నింటి పరిచయం..
బ్లూ బాక్స్ కిట్
రొమ్ము క్యాన్సర్ పరీక్షకు ఉపయోగించే ఈ కిట్‌కు గత ఏడాది జేమ్స్ డైసన్ అంతర్జాతీయ పురస్కారం లభించింది. మూత్ర నమూనా తీసుకొని రసాయన విశ్లేషణ ద్వారా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో సాయపడుతుంది.
ఏవా వుమెన్
నెలసరి, అండాల విడుదల, గర్భధారణకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి సాయపడే.. ఫర్టిలిటీ ట్రాకర్ ఇది. ఉష్ణోగ్రత, శ్వాసక్రియ రేటు కూడా తెలుపుతుంది. గుండె స్పందనలో తేడాలను వివరిస్తుంది.
లాక్ట్యాప్
బాలింతలకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తుంది. దీన్ని స్పెయిన్‌లో అభివృద్ధి చేశారు. మాతృత్వానికి సంబంధించి వివిధ సమస్యలకు జవాబులు ఇస్తుంది. నిపుణులతోనూ మాట్లాడిస్తుంది.
ఎలి
ఈ పరికరం లాలాజలాన్ని నమూనాగా తీసుకొని శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులను పసిగడుతుంది. తద్వారా అండం విడుదలయ్యే రోజులను నిర్ధారిస్తుంది.
జెన్నెవ్
మెనోపాజ్‌కు సంబంధించిన ఆన్లైన్ క్లినిక్ ఇది. ఆ దశ చుట్టూ అల్లుకొన్న అపోహలను బద్దలు కొట్టడమే లక్ష్యం. ఉద్రేకం, నిద్రలేమి, లైంగిక అనాసక్తి లాంటి సమస్యలకూ సలహాలు అందిస్తుంది.