శభాష్ షాలినీ


Wed,September 19, 2018 12:58 AM

బస్ కండక్టర్ కూతురు అయిన షాలినీ అగ్నిహోత్రి ఐపిఎస్ అధికారిణిగా శిక్షణ తీసుకునే సమయంలోనే తన ప్రతిభను చూపి అందరితో శభాష్ అనిపించుకుంటున్నది.
conductor-daughter
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లా, తాతల్ గ్రామానికి చెందిన షాలిని అగ్నిహోత్రి తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చదువులోనూ, ఆటలలోనే కాకుండా అన్నింటిలోనూ ముందుండేది. షాలిని తండ్రి బస్ కండక్టర్‌గా పనిచేసేవాడు. షాలిని సోదరుడు ఆర్మీలో అధికారిగా, సోదరి డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. షాలిని మాత్రం సివిల్స్‌లో పనిచేయాలనే లక్ష్యంతో ఐపీఎస్‌గా శిక్షణ తీసుకున్నది. ముస్సోరీలో ఐపీఎస్‌గా శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఓసారి షాలిని తండ్రి పోలీస్ టైనింగ్ అకాడమీకి వచ్చారు. అప్పుడు షాలినిని పోలీస్ యూనిఫామ్‌లో చూసిన తండ్రి చాలా సంతోషపడ్డాడు. తన తండ్రికి తోటి అధికారులతో కలిసి భోజనం చేసే అవకాశం దక్కింది. ఆమె యుపిఎస్‌సీ పరీక్షలు రాసేందుకు ఎంతో కష్టపడింది. ఇంటర్నెట్‌లో పుస్తకాలు, దినపత్రికలు, ఇతర సంచికలు చదవడంతోపాటు పలురకాల అంశాలను తెలుసుకునేందుకు ఉచితంగా అందించిన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నది. శిక్షణలోనే అసమాన ప్రతిభ చూపిన షాలిని 65వ ఐపిఎస్ బ్యాచ్‌లోనే ఆల్ రౌండర్ ట్రైనీగా ఎంపికైంది. అంతేకాకుండా ప్రధాన మంత్రి బటన్ అవార్డు పాటు, హోం శాఖ మంత్రిత్వ శాఖ నుంచి రివాల్వర్‌ను కూడా బహుమతిగా అందుకున్నది. మత సామరస్యం-జాతీయ సమైక్యత అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఆమెకు ట్రోఫీ లభించింది. షాలిని మొట్టమొదటి సారిగా సిమ్లాలో అసిస్టెంట్ సూపరింటిండెంట్‌గా విధులు నిర్వహించిన సమయంలో ఇద్దరు కరడు గట్టిన నేరస్తులకు శిక్ష పడేలా చేసి అందరి ప్రశంసలూ అందుకున్నారు. ప్రస్తుతం షాలిని హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాకు ఎస్పీగా పనిచేస్తున్నది. ఎలాంటి కలలనైనా సాకారం చేసుకోవాలంటే అందుకు తగిన పట్టుదల, శ్రమ ఉండాలని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువతులందరికీ షాలినీ ఆదర్శంగా నిలుస్తున్నది.

619
Tags

More News

VIRAL NEWS