ఎందుకంటే?


Fri,October 5, 2018 03:03 AM

Endukante
ప్రతీ సంవత్సరం మన దేశంలోని ఏదో ఒక ప్రధాన నదికి లేదా ముఖ్యోపనదికి పుష్కరాలు వస్తాయి. ఈసారి భీమరథీ (భీమా) నదీ పుష్కరాలు ఈ గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలకే కాదు, ప్రకృతి ఆరాధకులకు కూడా ఇదొక సత్సందర్భం. ఎందుకంటే, ఇటీవలి వర్షాలతో అనేక జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎక్కువకు ఎక్కువ అంతా కొత్త నీరే. అంతేకాదు, మామూలు సమయాలలోకంటే ఈ ప్రత్యేక వేళల్లో ఆ నదీతీర క్షేత్రాల సందర్శన వల్ల అటు పుణ్యం, ఇటు ఆహ్లాదం రెండూ కలుగుతాయన్నది వేద పండితుల మాట. మహారాష్ట్రలోని భీమా నదీతీరంలో వెలసిన ప్రధాన పుణ్యక్షేత్రాలలో పండరీపురం, భీమశంకరం (జ్యోతిర్లింగం) ఉన్నాయి. నదులలోని ప్రవాహ జలాలలో మరీ ముఖ్యంగా జనం ఎక్కువగా లేని తీరప్రదేశాలలో అయితే కాలుష్యాల పాలు కొంత తక్కువే ఉంటుంది. కాబట్టి, పుష్కర పుణ్యతీర్థ యాత్రలకు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోండి మరి.

1006
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles