‘డీజే’ పెండ్లికూతురు


Sun,April 14, 2019 01:05 AM

పెండ్లంటే.. పీటల మీద పెండ్లికూతురు సిగ్గుపడుతూ కూర్చునే రోజులు పోయాయ్. కలకాలం గుర్తుండిపోయే పెండ్లిని తనకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నారు నేటితరం. ఎందుకంటే.. తన పెండ్లిలో తానే డీజేగా మారి.. పెండ్లికొచ్చిన వారందరినీ ఉర్రూతలూగించింది ఈ పెండ్లికూతురు.
DJ-Bride
అషిత బండారీ కపూర్ అనే ఈ పెండ్లి కూతురు కొత్త పద్ధతికి నాంది పలికింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకోవాలన్న కోరిక నెరవేడంతో తన ఆనందానికి అవధుల్లేవు. కాబోయే భర్త సార్థిక్ కపూర్‌ను ఒప్పించి.. తన పెండ్లికి తానే డీజీ ఆపరేట్ చేసింది. మస్త్ మస్త్ మ్యూజిక్‌తో.. మిక్సింగ్ సాంగ్స్‌తో పెండ్లికి వచ్చిన వారితో చిందులేయించింది. శ్రీలంకలో జరిగిన ఈ పెండ్లి తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెబుతున్నది అషిత. ఈ పెండ్లిలో జరిగిన సంగీత్, మెహందీ, హల్దీ వంటి ఫంక్షన్లకంటే.. అషిత పాల్గొన్న డీజేనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఛలో ఇష్క్ లడాయే.. అనే పాటను మిక్స్ చేస్తూనే వరుడు సార్థక్‌తో కలిసి డ్యాన్స్ చేసింది అషిత. తన పెండ్లికి తాను డ్యాన్స్ చెయ్యాలనేది అషిత చిన్ననాటి కల. ఈ విధంగా తన కల నెరవేర్చుకున్నది. శ్రీలంకలోని వెల్లిగామా బే మారియట్ రిసార్ట్ అండ్ స్పాలో ఈ పెండ్లి జరిగింది. ఈ పెండ్లికి చేసిన డెకరేషన్ నుంచి ఏర్పాట్లన్నీ అద్భుతం అనిపించాయి.
DJ-Bride2

544
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles