‘ఎనీ డెస్క్’ వద్దు..


Fri,March 1, 2019 03:22 AM

ఆన్‌లైన్ లావాదేవీలు ఎక్కువగా జరుపుతారా? అందుకోసం ప్లేస్టోర్‌లో దొరికిన యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త మీ డబ్బులు మాయం కావొచ్చు.
any-desk
ఈ మధ్య ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే సర్వర్ ప్రాబ్లమ్ ఉంది. 24 గంటల తర్వాత మీ డబ్బులు వాపస్ ఇస్తాం అంటూ మెసేజ్‌లు పంపిస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు నొక్కేస్తారు. అలాంటి వాటిలో ఎనీడెస్క్ అనే సంస్థ కూడా ఒకటి అని ప్రకటించింది ఆర్బీఐ. ఎనీడెస్క్ అనే యాప్ ద్వారా ఆన్‌లైన్ మనీ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు ఆర్బీఐ గుర్తించింది. సైబర్ నేరగాళ్లు ఈ యాప్‌ను ఈజీగా హ్యాక్ చేసి మీ ఖాతాలోని డబ్బులు తమ అకౌంట్‌లోకి మార్చుకుంటున్నారట. మీ ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు అన్నీ ఈ యాప్ ద్వారా సేకరించి డబ్బులు మాయం చేస్తున్నది ఈ యాప్. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆర్బీఐ సైబర్ సెక్యూరిటీ విభాగం, ఐటీ విభాగం ఒక ప్రకటన చేసింది. నకిలీ యాప్‌ల ద్వారా కూడా మీ డబ్బులకు ఎసరు పెట్టే మోసగాళ్లున్నారు. కాబట్టి ఎనీడెస్క్ లాంటి యాప్‌లతో లావాదేవీలు జరిపేవారంతా అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కమీషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ హెచ్చరిస్తున్నది.

783
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles