‘అతడి’ కొడుకు రోవన్!


Sun,March 10, 2019 12:54 AM

ఇష్టంతో చేస్తున్నప్పుడు కష్టం ఎందుకు అనిపిస్తుంది. అందుకే మగాడిగా పుట్టినా.. మహిళగా మారాలనిపించింది. అనూహ్యంగా అమ్మతనం అతడ్ని వరించింది. మగజన్మకు సాధ్యంకానీ రీతిలో ఓ బిడ్డకు తండ్రయ్యాడు. ఆ ఆనందాన్ని మనతోనూ పంచుకుంటున్నాడు.
Rovan
అమ్మతనం ఆడవాళ్లకు దేవుడిచ్చిన వరం. అయితే అలాంటి అదృష్టాన్ని అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన విల్లే సిమ్సన్ కొట్టేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డకు రోవన్ అని నామకరణం చేసి.. ఆ సంతోషాన్ని మనతో పంచుకుంటున్నాడు. అమెరికా టెక్సాస్ నగరానికి చెందిన విల్లే సిమ్సన్ ఏడేళ్ల క్రితం లింగ మార్పిడి చేసుకొని అమ్మాయిగా మారాడు. ప్రియుడు స్టీఫెన్ గేత్‌తో కలిసి నివసిస్తున్నాడు. వారి ఏడేళ్ల సహజీవనానికి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వాలని భావించాడు విల్లే. అతడి కోరిక నేరవేరే అవకాశం కనిపించలేదు. లింగ మార్పిడి చేయించుకున్నంత మాత్రాన పురుషుల్లో గర్భసంచి ఉండదని అందుకే గర్భం దాల్చడం అసాధ్యమని చెప్పారు డాక్టర్లు. కానీ, ఫిబ్రవరి 2018లో అతనికి నెలసరి రావడం ఆగిపోయింది. అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్లారు ఆ జంట. విల్లే గర్భం దాల్చినట్లు నిర్ధారించారు వైద్యులు. ఇందుకు ఏ ట్రీట్‌మెంట్ తీసుకోకుండానే అమ్మ అయ్యే అవకాశం రావడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. అయితే నెలలు నిండకుండానే ఏడో నెలలో పండంటి మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బాబుకి రోవన్ అని పేరు పెట్టారు. ఆ బాబుతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు విల్లే స్టీఫెన్‌లు.

811
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles