హోమియోతో నడుము నొప్పి దూరం


Wed,April 27, 2016 12:03 AM

శరీర భాగాల్లో ముఖ్యమైనది వెన్ను పూస. వివిధ రకాల ఒత్తిళ్ల వల్ల, జీవన విధానాల్లో మార్పుల వల్ల, వ్యాయామం చేయక పోవడం వల్ల, వెన్నముకపై తీవ్రమైన ప్రభావం పడి వెన్నుపూలలు అరగడం మొదలవుతుంది. ఫలితంగా వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది.
సాధారణంగా అధిక బరువు ఎత్తడం వల్ల, చాలా సమయం పాటు ఒకే భంగిమలో ఉండడం వల్ల, ముందుకు వంగి పనిచేయడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నొప్పి మొదలవుతుంది. మొదటగా నొప్పి మొదలైనపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ సమస్యను కొద్ది రోజుల్లోనే దూరం చేసుకోవచ్చు. కానీ నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలిక సమ్యగా మారవచ్చు. వెన్నెముకలో నొప్పి 12 వారాల కంటే ఎక్కువగా ఉంటే దానిని దీర్ఘకాలిక నొప్పిగా పరిగణించి డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

కారణాలు
పరిమితిని మించి శ్రమించడం వల్ల వెన్నెముకతో అనుసంధానమై ఉన్న కండరాల్లో నొప్పి వస్తుంది. ఇది కొద్దిపాటి విశ్రాంతితో తగ్గుతుంది. అలా తగ్గకుండా ఉంటే మాత్రం నిపుణుల సహాయం అవసరమవుతుంది.
వెన్ను పూలల్లో అరుగుదల వల్ల కూడా నొప్పి వస్తుంది. శరీరానికి తగినంత కాల్షియం, విటమిన్ డి అందకపోవడం వల్ల వెన్నుపూసలు అరుగుతాయి. దీనిని లాంబార్ స్పాండిలోసిస్ అంటారు.
పని ఒత్తిడి పెరిగినపుడు, బరువులను ఎత్తడం వల్ల కొన్నిసార్లు డిస్క్ పక్కన ఒరిగిపోతుంది. దీనిని స్లిప్ డిస్క్, లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అనూహ్యంగా ఒకేసారి విపరీతమైన నడుము నొప్పి కదలకుండా అయిపోవడం, స్లిప్ డిస్క్ వల్ల వస్తుంది. కొన్ని సార్లు ఈ డిస్క్ పక్కన నరాలపై ఒత్తిడి కలిగినపుడు కాళ్లలో నొప్పి రావడం, తిమ్మిరి రావడం జరుగుతుంది.
వయసు పెరిగిన కొద్ది ఎముకలు అరిగినట్టుగానే వెన్నెముక కూడా అరగిపోవచ్చు.
సరైన వ్యాయామం లేకపోవడం వల్ల వెన్నెముక కండరాలలో ఎముకలలో పటుత్వం తగ్గిపోతుంది. తద్వార తేలికపాటి పనులు చేసినప్పటికీ నొప్పి వస్తుంది.

లక్షణాలు
మొదట్లో తేలిక పాటి నొప్పి నడుము కింది భాగంలో మొదలై క్రమంగా తీవ్రమవుతుంది.
కూర్చుంటే నొప్పి, కూర్చుని లేచే సమయంలో నొప్పి, తర్వాత కాలంలో కదులుతుంటే నొప్పి, ఇలా క్రమంగా నొప్పి తీవ్రమవుతుంటుంది.
నాడుల మీద ఒత్తిడి పెరిగితే కాళ్లలోకి నొప్పి పాకినట్టుగా ఉంటుంది. ఈ రకమైన నొప్పిని సయాటికా నొప్పి అంటారు.
డిస్క్ కంప్రెషన్ వల్ల స్పైనల్ కెనాల్ మూసుకుపోవడం వల్ల నడవలేకపోవడం, కాళ్లలో వణుకు రావడం, మూత్ర విసర్జన, మల విసర్జనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.

నిర్ధారణ
వెన్నెముక సమస్యను గుర్తించడానికి ఎక్స్‌రే , ఎంఆర్‌ఐ తో పాటు రక్తపరీక్షలు అవసరమవుతాయి.

జాగ్రత్తలు
కూర్చున్నపుడు, నిలబడినపుడు సరైన భంగిమలను అనుసరించాలి. ఒకే భంగిమలో చాలా సమయం పాటు ఉండకూడదు. కనీసం 45 నిమిషాలకు ఒకసారి భంగిమను మార్చాలి. అధిక బరువు వీలైనంత వరకు ఎత్తకుండా ఉండాలి. ముందుకు వంగి పనులు చేయ్యకూడదు. కూర్చున్నపుడు సరైన వెన్నుకు ఆధారం ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు వ్యాయామం చెయ్యాలి. సరైన పౌష్టికాహారం, కాల్షియం, విటమిన్ డి, ఫాస్ఫరస్ అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. అన్ని వయసుల వారు ఉదయం పూట సూర్యరశ్మిలో కొంత సమయం గడపాలి. ఆకుకూరలు, పాలు, పండ్లు, గుడ్డు వంట పౌష్టికాహారం తీసుకోవాలి.

హోమియో వైద్యం
నడుము నొప్పిని శాశ్వతంగా నివారించడానికి హోమియోలో చక్కని మందులు కాలవు. రోగి, శారీరక, మానసిక లక్షణాలను అనుసరించి ముందులు ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి.
అనూహ్యంగా వచ్చిన నడుమునొప్పికి రస్టాక్స్, కాల్కేరియా ఫ్లోర్, ఆర్నికా, బెల్లిస్‌పెర, బ్రయోనియా, హైపరీకమ్, రూట, గాల్థేరియా వంటి మందులు ఉపకరిస్తాయి.
Murali

1956
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles