హైపోథైరాయిడిజం-హోమియో చికిత్స


Wed,December 3, 2014 02:24 AM

మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. మెడ ప్రాంతంలో కంఠం దగ్గర సీతాకోకచిలుక రెక్కల రూపంలో శ్వాసనాళానికి ఇరుపక్కల ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రక్తప్రసరణలో కలిసి శారీరక ఎదుగుదలతో పాటు వివిధ జీవక్రియలను నిర్వహిస్తాయి. ఈ గ్రంథి మెదడులోని పిట్యుటరీ గ్రంథి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో తగిన మోతాదులో థైరాయిడ్ హార్మోన్లు లేనప్పుడు పిట్యుటరీ గ్రంథి అవసరాన్ని గ్రహించి, టిఎస్‌హెచ్ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఈ టిఎస్‌హెచ్ సంకేతాలతోనే థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసి రక్తప్రవాహంలోకి పంపుతుంది.

థైరాయిడ్ సమస్యలు రెండు రకాలు


హైపోథైరాయిడిజం : ఇది సర్వసాధారణంగా కనిపించే థైరాయిడ్ వ్యాధి. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను శరీరంలో కావలసిన దానికంటే తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది.
హైపర్‌థైరాయిడిజం : థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వస్తుంది.

ఈ రెండింటిలో హైపోథైరాయిడిజం సాధారణంగా కనిపించే సమస్య. ఇది ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు, పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

థైరాయిడ్ సమస్యలు - దుష్ప్రభావాలు


గాయిటర్ : థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరగడం. గొంతు కింద వాపు వల్ల శ్వాసనాళం, ఆహారనాళం పైన ఒత్తిడి పెరిగి మింగడం కష్టంగా ఉంటుంది. స్వరంలో మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అంతేగాక బరువు పెరగడం, నీరసం, డిప్రెషన్, మలబద్దకం వంటి సమస్యలుంటాయి.
మిక్సెడిమా : ఇది అరుదుగా కనిపించే ప్రాణాంతక సమస్య. దీర్ఘకాలికంగా హైపోథైరాయిడిజం నియంత్రణలో లేకపోవడం వల్ల వస్తుంది. వీళ్లు చలికి తట్టుకోలేరు. మగత, బద్దకం, అపస్మారక స్థితి (కోమా)లోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇన్‌ఫెక్షన్లు, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల వ్యాధి తీవ్రం అవుతుంది.
సంతానలేమి సమస్యలు : థైరాయిడ్ హార్మోన్ తక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల స్త్రీలలో అండం విడుదల కాకపోవడం లేదా ఫలదీకరణ చెందిన అండం నిలవకుండా గర్భస్రావం కలగడం, ఈస్ట్రోజన్ ఎక్కువ, ప్రొజెస్టిరాన్ తక్కువ ఉండడం.

గర్భిణుల్లో హైపోథైరాయిడిజం : గర్భిణుల్లో హైపోథైరాయిడిజం ఉన్నవారు చికిత్స తీసుకోకపోవడం వల్ల నెలలు నిండకముందే ప్రసవం కావడం లేదా పుట్టిన పిల్లల్లో బుద్ధి వికాసం ఉండకపోవడం, ఎదుగుదల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు బిడ్డ పుట్టడంతోనే హైపోథైరాయిడిజం ఉండడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి.

srikanth

పెరిఫెరల్ న్యూరోపతి : దీర్ఘకాలికంగా హైపోథైరాయిడిజం నియంత్రణలో లేకపోవడం వల్ల నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిరి, మొద్దుబారడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కండరాల బలహీనత, కండరాలు నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇతర సమస్యలు : హైపోథైరాయిడిజం వల్ల రక్తహీనత, తలనొప్పి, కీళ్లనొప్పులు, గ్లకోమా, హృద్రోగ సమస్యలు, కిడ్నీ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

నిర్ధారణ పరీక్షలు


థైరాయిడ్ ప్రొఫైల్ - టి3, టి4, టిఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్
హోమియో చికిత్స హోమియోవైద్యం ద్వారా హైపోథైరాయిడ్‌కి గల మూల కారణాన్ని తొలగించి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా వ్యాధి నయం చేస్తారు. రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, , మానసిక -శారీరక లక్షణాలను బట్టి హోమియో మందులు ఇస్తారు. ఇవి హైపోథాలమస్-పిట్యుటరీ వ్యవస్థను సరిచేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి సాధారణ స్థాయిలో హార్మోన్లను ఉత్పత్తి చేసేలా చేసి, సమతుల్యతను కాపాడుతుంది. జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలియం విధానం ద్వారా థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు.

6785
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles