హైటెక్ బిచ్చగాడు!


Sun,March 3, 2019 01:35 AM

అడుక్కోవాలంటే చేతిలో చిప్ప ఉండాలి.. ముఖం బీదగా పెట్టడం పాత పద్ధతి. బాబూ.. అమ్మా.. ధర్మం చెయ్యండయ్యా..! అనే రోజులూ పోయాయి. ఈ స్మార్ట్ కాలంలో.. ఇతనిలా స్మార్ట్‌గా కూడా అడుక్కోవచ్చు. అంతేకాదండోయ్.. నెలకు లక్షల రూపాయలు కూడా సంపాదించొచ్చు.
Hitech-Bicchagaadu
హైదరాబాద్‌లాంటి మహానగరాల్లో భిక్షగాళ్ల సంపాదన ఏటా కోట్ల రూపాయల్లో ఉంటుంది. కొంతమంది తిండికోసం అడుక్కుంటే.. మరికొంతమంది యాచించడమే వృత్తిగా బతుకుతున్నారు. చాలామందికి ఇదో దందా అంటుంటారు. అయితే.. ఇతని ట్రెండే వేరు. కేవలం ఆన్‌లైన్‌లోనే అడుక్కుంటాడు ఈ హైటెక్ బిచ్చగాడు. చీప్‌గా రోడ్డు మీదో, గుడి ముందో కూర్చొని అడుక్కునే కంటే... ఇంట్లో ఏసీ గదిలో మెత్తని పరుపు మీద పడుకొని అడుక్కోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆలోచన వచ్చిందే లేటు... ట్విట్టర్‌లో అడుక్కోవడం మొదలెట్టాడు. ఇలా నెలకు రూ.5 లక్షలకు తగ్గకుండా సంపాదిస్తున్నాడు. ఇతని పేరు జోవాన్ హిల్. ఉండేది అమెరికాలోని న్యూయార్క్‌లో. 25యేండ్ల జోవాన్‌కు అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నా.. పని చేయడానికి బద్దకం. చదువు మధ్యలోనే మానేశాడు. అడుక్కోవడానికి ముందు ఓ రెస్టారెంట్‌లో పనిచేసేవాడు. అక్కడ వచ్చే రూ.87 వేలతో బతకలేక.. ఆన్‌లైన్‌లో అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఇతనో సరదా మనిషి కూడా. లైవ్ చాటింగ్ చేస్తూ.. తన ఫాలోవర్స్‌ను నవ్విస్తూ భిక్షమెత్తుకుంటాడు. ఇంకో విషయం.. ఇతనికి ట్విట్టర్‌లో లక్షన్నరకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

1469
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles