హెల్త్‌కేర్ : సడలిన విశ్వాసం


Sat,January 12, 2019 12:36 AM

health-care
హెల్త్‌కేర్ దేశంలో ప్రస్తుతం అతి పెద్ద సవాల్. అసలు హెల్త్‌కేర్ వ్యవస్థ మీద 96.5 శాతం మంది ప్రజలకు విశ్వాసమే లేదని ఓ సర్వే తేల్చి చెప్పింది. మరో 67.8 శాతం మంది హాస్పిటల్స్‌ను అస్సలు నమ్మడం లేదు. ఆసుపత్రి ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండటంతో హెల్త్ ఇన్సూరెన్స్‌లను తప్పనిసరిగా తీసుకోవాలని 62.8 శాతం మంది భావిస్తున్నారు. 30 ఏండ్ల వయసులోనే ఆరోగ్య పాలసీని తీసుకోవాల్సిందేనని 80 శాతం మంది అభిప్రాయపడుతున్నారట. జీఓక్యూఐఐ అనే సంస్థ ఇండియా ఫిట్ నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో చాలా ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అర్థం చేసుకోలేకపోవడం కారణంగానే తీసుకోవడం లేదట మరికొంత మంది. హెల్త్‌ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా వసూలు చేస్తున్నందునే పాలసీలను తీసుకోవడం లేదు. అయితే ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నవారిలో దాదాపు 88 శాతం మంది క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ పాలసీలకే మొగ్గు చూపుతున్నారు.

20-45 ఏండ్ల మధ్య వయస్సు వారిలో కనీసం 38.3 శాతం మంది డయాబెటిస్, బీపీ, థైరాయిడ్, ఎసిడిటీ వంటి ఏదో జబ్బుతో బాధపడుతున్నారు. గత రెండేండ్లలో లైఫ్‌స్టయిల్ జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇలా పెరుగుతున్న జబ్బులు ఒక వైపు మరోవైపు హెల్త్‌కేర్ వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆర్థిక భారం భారీగా పెరిగిపోతుండడంతో చాలా మంది ఫిట్‌గా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రోజూ నడవడం, జిమ్‌లో చేరడం, సైక్లింగ్, ఎక్కువ సేపు నిద్రపోవడం వంటివి చేస్తున్నారట. ఈ నివేదిక ప్రకారం బెంగళూరు దేశంలో ఆరోగ్యకరంగా ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉందట. దేశంలో ఎక్కువగా బాధిస్తున్నది కాలుష్యమేనట. పుణె నగరంలో గాలి, నీరు, ఆహార కాలుష్యం తక్కువగా ఉన్నట్టు ఆ నివేదిక తేల్చింది.

384
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles