హెబ్బార్ కిచెన్!


Tue,February 26, 2019 01:19 AM

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మధ్యలో తినే బ్రేక్‌ఫాస్ట్, భోజనం, స్నాక్స్, డిన్నర్ ఏవేనా చిటికిలో చేసేస్తున్నది. హెబార్ కిచెన్‌లో అన్ని రుచుల్ని రుచి చూపిస్తున్నది. భారతదేశంలోనే అతిపెద్ద రెసిపీ సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్నది.
hebbar
హెబ్బార్ కిచెన్ ద్వారా బ్రేక్‌ఫాస్ట్ నుంచి డెసెర్ట్, మసాలా పౌడర్ నుంచి చట్నీల వరకు. అంతేకాకుండా శీతల పానీయాల తయారీలు వేటినైనా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చంటున్నది అర్చనా హెబ్బార్. పెళ్లికి ముందు మామూలు వంటలు కూడా చేతగాని అర్చన మంచి చెఫ్‌గా పేరుతెచ్చుకుంటున్నది. బెంగళూరులో ఉంటున్న అర్చనా, పెళ్లి తర్వాత ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అక్కడ ఉద్యోగం వెతుక్కోవడం కష్టమనుకొని విరమించుకున్నది. సరిగా రాని వంటనే ఉద్యోగంగా ఎంపిక చేసుకుంది. వంటల గురించి తల్లి, బంధువులు దగ్గర సలహాలు తీసుకుంది. రోజూ రకరకాల రెసిపీలు ప్రయత్నిస్తూ ఉండేది. అన్నీ వెజిటేరియన్‌కి సంబంధించినవే. తనకంటూ గుర్తింపు కోసం బ్లాగ్ క్రియేట్ చేసుకున్నది. అర్చన తయారు చేసిన రెసిపీని ఫొటోతో సహా పోస్ట్ చేసేది. మొదట్లో అంతగా పేరు రాలేదు. తర్వాత చిన్న వీడియోలుగా తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది.


hebbar2
దీంతో మంచి పేరు రావడంతో హెబ్బార్ కిచెన్ వెబ్‌సైట్ ప్రారంభించింది. వెజిటేరియన్‌లో సందేహాలున్న వారందరికీ హెబ్బార్ కిచెన్‌లో సమాధానాలు దొరుకుతాయని ట్వీట్ చేసింది. రోటీ, ఇడ్లీ, రవ్వ దోశ అన్ని రకాల వెజిటేరియన్ వంటల్ని రుచి చూపిస్తున్నది. అరగంటలో చేసే వంటని 2 నిమిషాల వీడియోగా తీసి అందరినీ అకర్షిస్తున్నది. దీనికి అర్చన భర్త సహాయం చేసేవాడు. హెబ్బార్ కిచెన్ వెబ్‌సైట్‌కి ఫేస్‌బుక్‌లో 9.3 మిలియన్లు, యూట్యూబ్‌లో 1.9 మిలియన్లు సబ్‌స్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 726,000 ఫాలోవర్లు ఉన్నాయి. ఈ యాప్‌ని పదిలక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది. దీని ద్వారా తక్కువ సమయంలో మంచి వంటలు వండుతున్నామని అర్చన అభిమానులు అంటున్నారు.

391
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles