హారతిని కండ్లకు అద్దుకోవద్దు!ఎందుకంటే?


Fri,February 15, 2019 01:31 AM

Endukante
దేవుడికిచ్చే మంగళహారతి కూడా దృష్టి హారతి వంటిదేనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి తెలిపారు. గత నెల కిందట హైదరాబాద్‌లో జరిగిన ధనుర్మాసోత్సవ ప్రవచనాల సందర్భంలో ఆయన ఈ విషయాన్ని భక్తులకు వివరించారు. దేవుడికిచ్చిన హారతిని పూజారి మన దగ్గరికి తెచ్చినప్పుడు ఆ జ్యోతిని రెండు చేతులతో స్వీకరిస్తూ కండ్లకు అద్దుకోవడం చాలామంది చేస్తారని, కానీ ఇది తగదని ఆయన అన్నారు. ఎవరి దృష్టీ తగులకుండా పిల్లలు వంటి వారికి మనం ఎలాగైతే దిష్టిని తీసేస్తామో దేవునికీ ఆయన దివ్యమంగళ రూపానికి దిష్టి తగులకుండా హారతివ్వడం ఆనవాయితీగా వస్తున్నదని ఆయన అన్నారు. మంగళహారతి ఇవ్వడంలోని పరమార్థం ఇదేనని కూడా చిన జీయర్ స్వామి వివరించారు. దిష్టి తీసిన గుమ్మడికాయను, హారతిని ఎలాగైతే బయట పారవేస్తామో ఇదీ అలాంటిదేనని, మనం కండ్లకు అద్దుకోనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు.

844
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles