హాట్ సమ్మర్.. కూల్ ప్లేసెస్


Fri,April 19, 2019 01:50 AM

Astana
మన దేశంలో ప్రజలు ఫ్యాన్ల గాలికి సరిపడక, కూలర్లు, ఏసీలు అంటూ వెతుక్కుంటున్నారు. చల్ల గాలికోసం వెతుకుతున్నారు. ఇంత హాట్ సమ్మర్‌లో కూడా అక్కడమాత్రం జీన్స్, స్వెటర్స్, షూస్ తప్పని సరిగా వేసుకోవాలి. లేకపోతే చలికి గజగజ వణికిపోవాల్సి వస్తుంది. ఆ ప్రదేశాలేంటి.. వాటి ప్రత్యేకతలేంటో చదివేయండి. ఎండలు మండిపోతున్నాయి. ముఖాలు మాడిపోతున్నాయి. వేడిని తట్టుకోలేక ఊటీ, కొడైకెనాల్‌లాంటి హిల్ స్టేషన్ల బాటపడుతున్నారు భారతీయులు. ఎండల విషయం పక్కన పెడితే ఇరవై నాలుగు గంటలు మంచు కురిసే దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది. ఇవి ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాలు.. ఈ మండుటెండల్లో వెళ్లి వేసవిని కాస్త చల్లగా మార్చుకోండి. ఈ హాట్ సమ్మర్.. కూల్ ప్రదేశాల గురించి చదివి.. వీలైనప్పుడు ఓ ట్రిప్పేసి రండి..

అస్తానా, కజకిస్థాన్

Astana-Kazakhstan
అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్న నగరాల్లో ఇదొకటి. శీతాకాలంలో మైనస్ 30నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎనిమిది లక్షల మంది నివాసముంటారు ఇక్కడ. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ నగరంలో ఉన్న నదిలో నీరు గడ్డకట్టిపోతుంది. ప్రయాణాలు సాగవు.

వెర్కోయాన్స్, రష్యా

Verkhoyansk-Russia
ఒమైకాన్ పక్కనే ఉన్న వెర్కోయాన్స్ కూడా అతి చల్లని నగరాల్లో ఒకటి. చలికాలంలో రాకపోకలన్నీ స్తంభించిపోతాయి. యానా నది మీద ప్రయాణ రాకపోకలు జరుగవు. కేవలం హెలిక్యాప్టర్ల ప్రయాణమే సాధ్యమవుతుంది. అదొక్కటే ఏకైక మార్గం. ఇక్కడి జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి. గుడారాలు వెచ్చగా ఉండడం కోసం 24 గంటలు మంటలు పెట్టుకొని జీవిస్తారు. ఇక్కడి జనాభా కూడా చాలా తక్కువ. కేవలం 1300 మంది నివసిస్తారిక్కడ. వేట ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి.

స్నాగ్, కెనడా

Snag-Canada
ఇదొక చిన్న గ్రామం. కెనడాలోని యుకున్లోని అలస్కా హైవే వద్ద ఉన్నది. ఇక్కడి ప్రజలు చలికాలంలో అసలు బయట కనిపించరు.కారణం చలికి తట్టుకోలేకపోవడం. వృత్తులకు, వ్యాపారాలకు సెలవులు ప్రకటించి ఇండ్లలో ఉండిపోతారు.

ఉలాన్బాతర్, మంగోలియా

Ulaanbaatar-Mongolia
13 లక్షల మంది నివాసముండే పెద్ద నగరం. మంగోలియా రాజధాని కూడా ఇదే. గుడారాల ముందు బొగ్గులతో నిప్పులను తయారు చేసుకొని వెచ్చదనంతో ఉంటారు. చలికాలంలో ఇక్కడి ప్రజలు ఇండ్లలోనే ఉంటారు. ఇక్కడి ప్రజలను వేరే దేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తున్నది అక్కడి ప్రభుత్వం.

ఒమైకాన్, రష్యా

Oymyakon-Russia
ఆర్కిటిక్ సర్కిల్‌కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో 500 మంది జనాలు మాత్రమే నివసిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి చల్లని ప్రదేశం. ఇక్కడ జనవరి ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. 1933లో అత్యల్పంగా ఉష్ణోగ్రత మైనస్67.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇక్కడ వ్యవసాయం చేయడం సాధ్యం అవదు. వెచ్చగా ఉండడానికి ఎక్కువ చేపలను ఆహారంగా తీసుకుంటారు.

199
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles