హస్తభూషణం


Thu,January 24, 2019 11:04 PM

hasta bushanam
నేనున్నాను శీర్షికన పురాణపండ శ్రీనివాస్ రచన, సంకలనంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన మహాయజ్ఞ కేంద్రం వారు ప్రచురించిన అద్భుత గ్రంథం మహా రామభక్తుడైన ఆంజనేయస్వామి విశ్వరూపాన్ని భక్తులకు దర్శింపజేసింది. ఎ-ఫోర్ సైజులో 532 పేజీలతో అన్నీ అత్యంత అరుదైన కలర్ ఫొటోలను ఎంతో మందమైన గ్లేజ్‌డ్ న్యూస్‌ప్రింట్‌పై ముద్రించిన తీరు అసాధారణం. ఎంతో ఆకర్షణీయమైన ఆంజనేయస్వామి ముఖచిత్రంతోపాటు ప్రతీ పేజీలోనూ చిత్రాలకు తగ్గట్టు శ్లోకాలు, స్తోత్రాలు, వ్యాఖ్యలను పెద్ద సైజు అక్షరాలలో అందించారు. హనుమత్ భక్తులకు, ప్రత్యేకించి శ్రీరామసేవకులకు, మరీ ముఖ్యంగా విష్ణు ఆరాధకులకు ఇదొక వెలకట్టలేని గ్రంథం. ప్రతీ ఇంట వుండదగ్గది.

343
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles