హర్యానా బడుల్లో సాక్ష్యం!


Wed,March 13, 2019 01:14 AM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సరిగా లేక పోవడం వల్ల సర్కారీ బడులకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతున్నది. అటువంటి విద్యావ్యవస్థలో ప్రమాణాలను పెంచి ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన ఫలితాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నది హర్యానా సర్కారు. అందుకు సాక్ష్యంను ప్రారంభించింది.
haryana-govt-school
హర్యానా సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నది. అందుకోసం సాక్ష్యం పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడుతున్నారో తెలుసుకుంటారు. తద్వారా విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు. వారిని గ్రూపుల వారీగా విభజించి కావాల్సిన శిక్షణ ఇస్తుంటారు. అలా ప్రతీ విద్యార్థి చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా సాక్ష్యం కార్యక్రమాలను రూపొందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా సర్కారీ విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావచ్చని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ రాఖేష్ గుప్తా అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం హర్యానాలోని 22 జిల్లాల్లో ప్రభుత్వ విద్య మెరుగ్గా ఉందని అంటున్నారు. ఈ విధానం ద్వారా గతంలో 40 శాతం మార్కులు సాధించిన వారు ఇప్పుడు 88 శాతం మార్కులు సాధిస్తున్నారు. హర్యానా రాష్ట్ర ఉన్నత విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ సహకారంతో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థుల నైపుణ్యాన్ని ఎలా మెరుగుపరుచాలనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ విధానాన్ని రూపొందించారు.

398
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles