హనీ ఈజ్ ద బెస్ట్


Mon,February 25, 2019 01:11 AM

చర్మాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో సహజమైన పద్ధతి తేనెను ఉపయోగించుకోవడం. దానిలోని యాంటీ బాక్టీరియా, హైడ్రేట్ లక్షణాలు చర్మకాంతిని పెంచుతాయి.
honey
చర్మానికి సహజత్వాన్ని అందించడంలో, ముఖంపై మొటిమలు, మచ్చ లు, ముడతలు నివారించడంలో తేనె చక్కగా పని చేస్తుంది. రెండు స్పూన్‌ల తేనెలో కోడిగుడ్డు తెల్లసోన, కొంచెం శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేస్తే చర్మం కాంతివంతమవుతుంది. తేనె, పెరుగు, నిమ్మరసాన్ని కలిపి పెదాలపై మర్దనా చేస్తే పెదాలు తేజోవంతంగా కనిపిస్తాయి. కేవలం చర్మంపై కాకుండా జుట్టుకు కూడా తేనెను ఉపయోగించవచ్చు. దీనిలోని ఎంజైమ్‌లు జుట్టుకు మాయిశ్చరైజింగ్‌గా చేస్తాయి. కొద్దిగా కొబ్బరి నూనె, తేనె తీసుకుని రెండింటినీ తలపై రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.అందానికి ఎంతో ఉపయోగపడే తేనె ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. గాయాలు, పుండ్లు మానడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని పీహెచ్ 3.2 నుంచి 4.5 వరకూ ఉండడం వల్ల శరీరంలోకి వచ్చే బాక్టీరియాను అదుపు చేయగలుగుతుంది.కంటికి అవసరమైన విటమిన్-ఎ ప్కులంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది.

1016
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles