స్మార్ట్‌గా చూస్తున్నారు!


Tue,January 1, 2019 10:49 PM

ఆ వీడియోలు చూడడంలో యువత ముందున్నారట. 3 జీ, 4జీలు వచ్చాక స్మార్ట్‌గా చూసేస్తున్నారట. ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో ఇంకేం తెలిసిందంటే..
porn
పదమూడేళ్లకే పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోయాడు హైదరాబాద్‌కు చెందిన ఓ కుర్రాడు. పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. స్మార్ట్ ఫోన్ వచ్చాక వయసుతో పని లేకుండా పోయింది. ప్రభుత్వాలు, టెలికాం సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోయింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక, జియోలాంటి సంస్థలు డేటా రేట్లు భారీగా తగ్గడంతో పోర్న్ వీడియోలు చూసే యువత సంఖ్య బాగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పోర్న్‌హబ్ సంస్థ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రోజులో ఎక్కువ శాతం హాట్ వెబ్‌సైట్స్ బ్రౌజ్ చేస్తున్నట్టు, యువత దానికి బానిస లవుతున్నట్టు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. పోర్న్‌హబ్ సంస్థ ఆరో వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది.


పోర్న్‌హబ్‌ను ఈ సంవత్సరంలో ఎక్కువగా చూసిన దేశాల్లో మన దేశం కూడా ఉండడం విశేషం. అమెరికా మొదటి స్థానం, బ్రిటన్ రెండో స్థానం, ఇండియా మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 3,350 కోట్ల క్లిక్స్ ఈ సైట్‌కి వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఆరు రెట్లు పెరిగింది. ముఖ్యంగా 95శాతం మంది మొబైల్ ఫోన్లలోనే చూస్తున్నారు. ముఖ్యంగా భారతీయుల్లో 18 నుంచి 24 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే 44 శాతం మంది ఈ వయసు వారున్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం ఏంటోగానీ యువత మాత్రం పాడవుతున్నదంటున్నారు కొందరు పెద్దలు. సరదాగా మొదలై మానసిక సమస్యల వరకు వెళ్తున్నాయని, మైండ్‌ని కంట్రోల్ చేసుకోకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.

600
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles