స్పైన్‌కు కూడా చిన్న సర్జరీ


Sat,March 11, 2017 11:53 PM

fixatiస్పైన్ సర్జరీ ఇదివరకు అంతా కూడా ఓపెన్ సర్జరీగా చేసేవారు. అంటే సర్జరీ జరిగే భాగంలోని భాగాలు సర్జన్ చూసేందుకు వీలుగా పెద్ద కోతతో తెరవాల్సిన అవసరం ఉండేది. ఇలీవల మినిమల్లీ ఇన్‌వేసివ్ సర్జికల్ టెక్నిక్‌తో ఎన్నోరకాల వెన్నెముక, మెడకు సంబంధించిన సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీలో పెద్దకోత అనేది ఉండదు అందువల్ల వెన్నెముక పరిసరాల్లో ఉండే కండరాలకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా నివారించవచ్చు. ఫలితంగా, చాలా సందర్భాల్లో సర్జరీ తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకునే అవకాశాలు కూడా మెరుగవుతాయి.

ఎంతో లాభదాయకం


సంప్రదాయిక ఓపెన్ సర్జరీలో 5 -6 అంగుళాల పొడవున గాటు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వెన్నెముక కనిపించే వరకు కండరాలను పక్కకు జరుపాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓపెన్ సర్జరీలో ఉండే అత్యంత పెద్ద లోపాల్లో ఇది ఒకటి. కండరాలను పక్కకు జరుపడం వల్ల చుట్టు పక్కల ఉండే మృదుకణజాలం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా కండరాలు గాయపడేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సర్జరీ తర్వాత కూడా ఇది నొప్పికి కారణమవుతుంది. అందువల్ల కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
subbayya

త్వరగా కోలుకోవచ్చు


మినిమల్లీ ఇన్‌వేసివ్ సర్జరీతో వెన్నెముకలోని కండరాలు, ఇతర అవయవాలు తక్కువ గాయాలతో వెన్నెముకలోని సమస్యలకు చికిత్స అందించేందుకుగాను ఈ టెక్నాలజీ రూపొందించబడింది. వెన్నెముకలో కేవలం సమస్య ఉన్న భాగాలను మాత్రమే చూసేందుకు కూడా అవకాశం ఉంటుంది. చిన్న కోత, తక్కువ రక్తస్రావం, ఎక్కువ రోజు హాస్పిటల్‌లో ఉండే అవసరం ఉండదు. అయితే ఈ విధానంలో అన్నిరకాల వెన్నెముక సమస్యలకు సర్జరీలు చెయ్యడం వీలుపడదు. సాధారణంగా ఓపన్ సర్జరీ విధానాలతో పోలిస్తే మినిమల్లీ ఇన్‌వేసివ్ విధానంలో తక్కువ సమయం తీసుకుంటుంది. అయినప్పటికీ అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎక్కువ గాట్లు కూడా పెట్టాల్సిన అసవరం ఏర్పడవచ్చు.

679
Tags

More News

VIRAL NEWS