స్పెషల్ లుక్ డే..


Thu,February 14, 2019 12:56 AM

ప్రేమికుల రోజు కూడా మామూలుగా తయారయితే ఏం బాగుంటుంది. ఈ రోజు కాస్త ప్రత్యేకంగా తయారవ్వాలి కదా. అందుకే ఈ చిట్కాలు మీ కోసం..
general
-మేకప్‌లో మొదట చేయాల్సింది ఫౌండేషన్. ఇది మృదువుగా ఉండేలా చూసుకోవాలి. ఫౌండేషన్ క్రీమ్ ఐప్లె చేసేటప్పుడు ముఖమంతా ఒకేలా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
-పౌడర్ రూపంలో ఉండేదాని కన్నా లిక్విడ్ రూపంలో లభించే ఫౌండేషన్ మంచిది. శరీర ఛాయను బట్టి ఫౌండేషన్ రాసి ముఖానికి పౌడర్ అద్దాలి. అతిగా అంటితే పౌడర్‌ని పఫ్‌తో నెమ్మదిగా తుడవాలి
-మేకప్ వేసుకునేటప్పుడు ఐ బ్రోలను సరిదిద్దుకోవాలి. ఐబ్రో పెన్సిల్ రాయాలనుకుంటే కనుబొమలకు ఆపోజిట్ డైరెక్షన్‌లో ఐప్లె చేయాలి. అప్పుడే కనుబొమ్మలు నాచురల్‌గా కనిపిస్తాయి.
-బట్టల్ని బట్టి లిప్‌స్టిక్‌ని ఎంచుకోకండి. శరీర రంగు, ముఖానికి వేసుకునే మేకప్‌ని బట్టి లిప్‌స్టిక్ ఎంపిక ఉండాలి. అప్‌లైనర్ వేసిన తర్వాత లిప్‌స్టిక్ రాసుకుంటే మంచిది.
-బుగ్గలు అందంగా కనిపించాలంటే బ్లషర్‌తో రోజ్‌ని ఐప్లె చేయాలి. గుండ్రటి ముఖం కలవారు ట్రయాంగిల్ షేపులో వాడాలి.
-కనురెప్పలు నిండుగా డార్క్ రంగులో కనిపించే డెఫినిషన్ మస్కారాని ఎంచుకోవాలి. దీంతో కనురెప్పలు దట్టంగా కనిపిస్తాయి. డ్రమాటిక్ ఐస్‌లా తయారవుతాయి.
-ఈ విధంగా తయారయి ప్రేమికులరోజుని ఆనందంగా గడపండి.

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles