స్ట్రెస్ రిలీఫ్-19


Fri,June 7, 2013 11:54 PM

yoga
ఒత్తిడికి దూరం కావాలంటే.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దాంతో పాటు ఈ ఆసనాలను కూడా వేసి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
పార్శ కోణాసనం
మొదట నిటారుగా నిలబడాలి. గాలి పీల్చుకొని రెండు పాదాలు ఒక మీటరు దూరం జరపాలి. అరచేతులు భూమివైపుగా ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ కుడిపాదాన్ని కుడివైపుగా తిప్పుతూ 90 డిగ్రీల కోణంలో వంచాలి. ఎడమకాలును మాత్రం వంచకూడదు. కుడి అరచేతిని కుడికాలి పక్కగా ఉంచి ఎడమ చేతిని ఎడమచెవి మీదుగా భూమికి సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో అరనిమిషం పాటు గాలి మామూలుగా పీలుస్తూ ఉండాలి. గాలి పీలుస్తూ ముందుగా కాలును, తర్వాత చేతిని యథాస్థితికి తీసుకురావాలి. ఇదేవిధంగా ఎడమవైపు కూడా చేయాలి. చేతిని కింద ఆన్చలేని వాళ్ళు పక్కన కుర్చీ వేసుకొని కూడా ఈ ఆసనాన్ని వేయవచ్చు. మామూలు స్థితిని పొందిన ఫలితాలనే ఈవిధంగా కూడా పొందవచ్చు.
ఉపయోగాలు:
- కాలి మడమలు, మోకాళ్ళు మొదలైన వాటిని ఉత్తేజపరుస్తుంది.
-సయాటికా, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
- నడుం చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుంది.
- మలబద్దకం నివారిస్తుంది.
జాగ్రత్త:
- మోకాలి నొప్పులు ఉన్నవారు చేయకూడదు.

పరివృత్త త్రికోణాసనం
ముందు నిటారుగా నిలబడాలి. రెండు పాదలను ఒక మీటరు వెడల్పు దూరంలో ఉంచాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా, భుజాలకు సమానంగా చాచాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని గాలి వదులుతూ కుడి చేతిని ఎడమ పాదానికి ఆన్చాలి. చేతిని వెనకవైపుగా తలమీదుగా నిటారుగా ఉంచి చూపును ఎడమ చేతి వైపు ఉంచాలి. ఇదే స్థితిలో కొన్ని సెకన్లు ఉండి తిరిగి యథాస్థితికి చేరుకోవాలి. ఇదేవిధంగా ఎడమవైపు కూడా చేయాలి.

ఉపయోగాలు:
- నడుము సన్నబడుతుంది.
- పునరుత్పత్తి అవయవాలకు చాలా మంచిది.

3132
Tags

More News

VIRAL NEWS

Featured Articles