స్ట్రెస్ రిలీఫ్-18


Fri,May 31, 2013 09:51 PM

yogad
ఒత్తిడిని దూరం చేసి ఏకాక్షిగతను పెంచే వృక్షాసనం, నటరాజాసనం ఈవారం...

వృక్షాసనం
రెండు పాదాలు దగ్గరగా పెట్టి నిల్చోవాలి. కుడికాలు మోకాలి దగ్గర ఎడమకాలు పాదాన్ని ఆన్చి బ్యాలెన్స్ చేస్తూ.. రెండు చేతులు తలమీదుగా జోడించాలి. ఈ స్థితిలో నేరుగా చూస్తూ, శ్వాస మామూలుగా పీలుస్తూ, పది సెకన్లపాటు ఉండాలి. తరువాత నెమ్మదిగా చేతులు, కాళ్లు యథాస్థితికి తీసుకురావాలి. ఇలా ఎడమ కాలుతో కూడా చేయాలి.
లాభాలు
- ఈ ఆసనంతో పాదాలు, మడమలు, మోకాళ్లు శక్తివంతమవుతాయి.
- ఏకాక్షిగత పెరుగుతుంది.
జాగ్రత్తలు :
- మోకాలి నొప్పులు ఉన్నవారు తక్కువ సమయం చేయాలి.

నటరాజాసనం
అద్భుతమైన నాట్యంతో తాండవం చేసే శివునికి మరోపేరు నటరాజు. అలాంటి నాట్య ముద్రలను పోలి ఉంటుంది కాబట్టే ఈ ఆసనానికి నటరాజాసనం అన్న పేరు వచ్చింది.
ముందుగా రెండు పాదాలు దగ్గరగా పెట్టి, చేతులు నిటారుగా ఉంచి నిల్చోవాలి. గాలి పీల్చుకుని కుడికాలిని వెనుకగా మడిచి, ఎడమ కాలిని ఎడమ చేతితో పట్టుకొని పైకి లాగాలి. అదే సమయంలో కుడి చేతిని పైకి లేపాలి. ఎడమ కాలిని వీలున్నంతగా పైకి లేపాలి. ఇదే స్థితిలో గాలి సాధారణంగా పీలుస్తూ ఉండాలి. చూపును ఒక చోట స్థిరంగా నిలిపి ఉంచాలి. ఒక నిమిషంపాటు ఈ భంగిమలోనే ఉండి మామూలు స్థితికి రావాలి. రెండు కాళ్ళతో ఇదే విధంగా 2 నుంచి 4 సార్లు చెయ్యాలి.
ఉపయోగాలు
- ఏకాక్షిగతను పెంచుతుంది.
- చాలా సమయం కూర్చొని పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగకరం.
- వెన్నెముకకు మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది.
- శరీరంలో బ్యాలెన్స్‌ను పెంచుతుంది.
- నాడీ వ్యవస్థను సమన్వయ పరుస్తుంది.
జాగ్రత్తలు :
- బలహీనమైన మోకాళ్ళు ఉన్నవారు కొద్ది సమయమే ప్రాక్టీస్ చేయాలి.
గమనిక
- యోగాకి ముందు పక్కనున్న వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

2762
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles