స్ట్రెస్ రిలీఫ్-16


Fri,May 17, 2013 10:38 PM

youga
ఈ మధ్యకాలంలో పిల్లలు చిన్నవయసులోనే చాలా స్ట్రెస్‌కు గురవుతున్నారు. ఇది భవిష్యత్‌లో వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీనివల్ల వాళ్లు జీవితంలో వచ్చే సమస్యలను సమర్థంగా ఎదుర్కోలేకపోవచ్చు. కాబట్టి పిల్లలను ఇప్పటినుంచే యోగాలోని ప్రాణాయామం, ఆసనం, రిలాక్సేషన్, కాన్‌సన్‌వూటేషన్, మెడి విభాగాల్లో ట్రైన్ చేసినట్లయితే వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసినవారమవుతాం! అలా ఒత్తిడిని తగ్గించి ఏకాక్షిగతను పెంచే కొన్ని యోగా ప్రక్రియలు.


పద్మాసనంలోకానీ, వజ్రాసనంలోకానీ ధ్యానం చేసే విధంగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. కళ్లకు సమానమైన ఎత్తులో కొద్ది దూరంలో దీపం లేదా కొవ్వొత్తి ఉంచాలి. రెప్పవేయకుండా కొవ్వొతి వైపు చూడాలి. కళ్లలో మంట లేదా నీళ్లు వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండాలి. ఒకసారి కన్నీరు కారిన తరువాత నెమ్మదిగా కళ్లు మూసుకుని కొద్దిసమయం పడుకోవాలి.

ఉపయోగాలు
-కన్నీటి గ్రంథులు జాగృతం అవుతాయి.
-దృష్టి లోపాలు సరి అవుతాయి.
- ఏకాక్షిగత పెరుగుతుంది.
-మనసును శాంతపరుస్తుంది.
- మానసిక నిగ్రహం అలవడుతుంది.

జాగ్రత్తలు :
- ముందు పది సెకన్లతో మొదలుపెట్టాలి.
- ఇది చేసిన తరువాత తప్పక రిలాక్స్ అవ్వాలి. లేకపోతే తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
- ఎక్కువగా టీవీ చూడటం లేదా కంప్యూటర్ వాడకం వల్ల వచ్చే రెప్పలు వాలిపోవడం వంటివి తగ్గుతాయి.

1. వజ్రాసనంలో నిటారుగా కూర్చొని రెండు చేతులను ఇరువైపులా చాపాలి. పిడికిలి బిగించి, బొటనవేలును మాత్రమే పైకి లేపాలి. ఇప్పుడు శ్వాస తీసుకుని.. శ్వాస వదులుతూ మెడ ఏమాత్రం కదలకుండా కళ్లను మాత్రమే కదిల్చి కుడి బొటనవేలివైపు చూడాలి. ఐదు సెకన్లపాటు ఉంచి, తిరిగి కళ్లను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు ఎడమవైపు, ఐదుసార్లు కుడివైపు చేయాలి.

2. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. ఇప్పుడు పిడికిలి బిగించి బొటన వేలు ఎత్తి ఎడమ చేతిని ముఖానికి ఎదురుగా, కుడి చేతిని భుజానికి సమాంతరంగా తీసుకురావాలి. ఇప్పుడు ముందుకు తెచ్చిన ఎడమచేతి బొటనవేలు వైపు చూడాలి. ఐదు సెకన్లపాటు ఉంచి, తిరిగి కళ్లు యథాస్థానానికి తీసుకురావాలి. ఐదు సార్లు చేయాలి. ఇదేవిధంగా కుడిచేతితోనూ చేయాలి.

3. కాళ్లు ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. ఎడమ చేతిని, ఎడమ తొడపై ఉంచి కుడిచేతిని 45 డిగ్రీల కోణంలో చాచి, పిడికిలి బిగించి బొటనవేలును పైకి ఎత్తాలి. ఇప్పుడు మెడ కదల్చకుండా కళ్లను మాత్రమే కదిలిస్తూ కుడిచేతి బ్రొటనవేలుని చూడాలి. ఐదు సెకన్లు చూసిన తరువాత తిరిగి కళ్లను యథాస్థానానికి తీసుకురావాలి. ఇలా ఐదుసార్లు చేయాలి. ఎడమవైపు కూడా ఇదే పద్ధతిలో చేయాలి.

పామింగ్
సూర్యోదయ సమయంలో కానీ, సూర్యాస్తమ సమయంలో లేత ఎండలో సూర్యునికి ఎదురుగా నిల్చొని కొన్ని సెకన్లపాటు సూర్యుడిని చూడాలి. తరువాత రెండు చేతులను కొద్దిగా రబ్ చేసి.. కళ్లమీద మసాజ్‌లాగా చేయాలి. ఇలా చేయడంవల్ల కంటిచుట్టూ ఉన్న నరాలమీద ఒత్తిడి పెరిగి కంటిచూపు స్థిరంగా ఉంటుంది.

2466
Tags

More News

VIRAL NEWS