స్కైవాక్‌కు బై.. క్లాస్‌రూమ్‌కి సై!


Mon,March 4, 2019 01:41 AM

కండివాలీ స్టేషన్ స్కైవాక్ దగ్గర అడుక్కునే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్లని చూసి చీదరించుకునేవారే కాని ఆదరించేవారెవరూ లేరు. అటువంటి వారితో ఓ యువతి రోజూ గంట సమయం గడుపుతున్నది. వారికి చదువు కూడా చెబుతానంటున్నది.
Haimanti-Sen
ముంభైలోని కండివాలీ స్టేషన్ స్కైవాక్ మీద చాలామంది పిల్లలు బిచ్చమెత్తుకుంటుంటారు. ఒకరోజు ఆహారం దొరుకుతుంది. మరొకరోజు ఉంటుందో లేదో చెప్పలేము. అందరికీ నెలకు ఒకసారి అమావాస్య వస్తే వారికి మాత్రం ప్రతిరోజూ అమావాస్యనే. ఆ పిల్లలకి బడికి వెళ్లే రాత రాసిపెట్టినట్టున్నాడు దేవుడు. 22 యేండ్ల హైమాంటి సెన్ అనే అమ్మాయి వారికి దారి చూపాలనుకున్నది. తను నేర్చుకున్న చదువుని నలుగురికి పంచాలనుకున్నది. 2018 నుంచి మురికివాడలో బతుకుతున్న పిల్లల్ని బడికి పంపడానికి ఇటీవలే ఒక ఎన్‌జీఓని స్థాపించింది. కండివాలి స్టేషన్ ఎస్క్‌లేటర్ దగ్గర ఖాళీగా తిరుగుతున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి వారి గురించి తెలుసుకున్నది. అందరినీ ఒక చోట చేర్చింది. 2018 మే నుంచి అక్టోబర్ వరకు రోజుమార్చి రోజు క్లాసులు తీసుకునేది. నవంబర్ నుంచి ప్రతిరోజూ ఒక గంట సమయం పిల్లలకి చదువు చెబుతున్నది. ఒక్కదాంతో మొదలైన జనూన్ సంస్థ ఇప్పుడు ఎనిమిది మందిగా మారింది. శనివారం, ఆదివారం నాడు టీమ్ అంతా కలిసి డాన్స్, ఆర్ట్, క్రాఫ్ట్ క్లాసులు తీసుకుంటారు. మంగళవారం, గురువారం, శుక్రవారం పాఠాలు బోధిస్తారు. బుధవారం నాడు వీధి నాటకాలు వేస్తారు. పిల్లలకి మంచి బట్టలు ఇవ్వడం, వారికి జడలు వేయడం అన్ని నేర్పారు. వీరు చూపించే శ్రద్ధకి తగ్గట్టుగా వారిలో మార్పు వచ్చింది. కొన్ని రోజులకి పేరు రాయడం కూడా నేర్చుకున్నారు.15 మందిలో కనీసం ఐదుగురిని ఉన్నత పాఠశాలకి పంపనున్నది. తరువాత మిగతా పిల్లల్ని కూడా పంపడానికి సిద్ధమవుతున్నది. నెలకు పిల్లలకు జరిపే యాక్టివిటీలకి అయ్యే ఖర్చు పదివేలు. ఈ పిల్లలకి ఎవరైనా సాయం చేయాలనకుంటే [email protected] కి పంపవచ్చు.

1235
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles