సౌదీ తొలి మహిళా రేసర్


Sun,March 10, 2019 12:52 AM

మహిళలు ఆశయాలు, లక్ష్యాలను చేరుకోవాలంటే సంప్రదాయాలు, ఆంక్షలను దాటుకొని రావాలి. సౌదీలో ఆంక్షలు ఆమె లక్ష్యాన్ని కొంతకాలం ఆపినా.. తన విజయాన్ని శాశ్వతంగా ఆపలేకపోయాయి.
Soudhi-Racer
కార్లంటే ఆమెకు పిచ్చి. రేసింగ్ అంటే ప్రాణం. ఆమె లక్ష్యం కూడా అదే. కార్ల రేసింగ్‌లో పాల్గొనాలని ఆమె కల. ఆ కలను నెరవేర్చుకుంది రీమా. మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఆమె చేతులకు ఇంతకాలం సంకెళ్లు వేశాయి. ఆ నిషేధాన్ని ఎత్తేస్తూ 2018 జూన్‌లో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆమె లక్ష్యానికి రెక్కలొచ్చాయి. చేతిలోకి స్టీరింగ్ వచ్చింది. ఇంకేం.. సౌదీలో తొలి మహిళా కార్ రేసర్‌గా రీమా ఆల్ జుఫ్ఫాలీ అనే 26 యేండ్ల మహిళ చరిత్ర సృష్టించింది. విదేశాల్లో చదువుకొన్న రీమా ఎఫ్1 కార్లంటే అమితంగా ఇష్టపడేది. స్వంత దేశానికి వెళ్లాక కార్లు నడపాలనీ, రేసింగ్‌ల్లో పాల్గొనాలని కలలు కన్నది. సౌదీ యువరాజు సంస్కరణల ఫలితంగా తన కలను సాకారం చేసుకుంది. కార్ రేసర్ లైసెన్స్ పొందడమే కాకుండా ఇటీవల పోటీలో కూడా పాల్గొంది. ఈ క్రమంలో త్వరలో జరుగనున్న ఎమ్‌ఆర్‌ఎఫ్ చాలెంజ్ తుది రౌండ్‌లో పాల్గొని విజేతగా నిలువాలని ఆరాటపడుతున్నది. మరి ఆల్ జుప్ఫాలీ కల నెరవేరాలని కోరుకుందాం.

1730
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles