సోరియాసిస్ నుంచి విముక్తి


Tue,September 12, 2017 11:17 PM

సొరియాసిస్ శరీరంలో ఒకటి రెండు రోజుల్లో జరిగే మార్పు వల్ల కలిగే పరిణామం కాదు. శరీరంలోని కణజాలల సప్తధాతువులు వ్యర్థ, విషపదార్థాలతో నిండిపోవడం వల్ల సొరియాసిస్ మొదలవుతుంది. శరీరంలో వ్యర్థాలు చేరడమే ఇందుకు కారణం. స్టిరాయిడ్స్ ద్వారా తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వగలరు కానీ సమస్యసు సమూలంగా తొలిగించలేరు. ఇందుకు పంచకర్మలను సూచిస్తుంది.
ayurveda
యేండ్లుగా మందులు వాడుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని అనే వారే ఎక్కువ. మూలాలను ఎరిగి వైద్యం జరుగకపోవడమే అందుకు కారణం. సొరియాసిస్ తగ్గే అవకాశం లేదనే అపోహ నిజం కాదు. శరీరం పైన కనిపించే ఈ వ్యాధి కేవలం అక్కడితో ఆగదు. వ్యాధి ముదిరే కొద్దీ సొరియాసిస్ వల్ల శరీరంలోని ఇతర కీలక అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా కిడ్నీలు, లివర్, గుండె, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు శరీరంలోని కీళ్లన్నీ దెబ్బతినే సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా పరిణమించవచ్చు. అందుకే శరీరంలోని వ్యర్థాలన్నింటినీ తొలిగించే పంచకర్మ చికిత్సలు తీసుకోవడం తప్పనిసరి.

చక్కని వైద్య విధానం

పంచకర్మ చికిత్స పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్‌కర్మ అనే మూడు భాగాలుగా ఉంటుంది. పూర్వకర్మలో దీపానపాచన, స్నేహ, స్వేద కర్మలు ఉంటాయి. ప్రధాన కర్మలో వమన, విరేచన, వస్తి, నస్యకర్మ, రక్తమోక్షణ ఉంటాయి. పశ్చాత్ కర్మలో రసాయన, వాజీకరణ చికిత్సలు ఉంటాయి. శరీరంలోని ఆమం అంటే వ్యర్థ, విషపదార్థాలను తొలిగించే పంచకర్మ చికిత్సలు. పంచకర్మకు ముందు పూర్వకర్మల్లోని దీపన పాచన చికిత్సలు చేయడంలోని ఉద్దేశం ఏమిటంటే వ్యక్తికి, వ్యక్తికి వారి జీర్ణశక్తి వేర్వేరుగా ఉంటుంది. దానికి వారి శరీర ధర్మం మూలంగా ఉంటుంది. వారి శరీర ప్రకృతిని పరిగణనలోకి తీసుకొని చేసే చికిత్సలు. దీపన, పాచన చికిత్సలు జఠరాగ్నిని సమస్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతాయి. ఆ తర్వాత పూర్వకర్మలో భాగమైన స్నేహ, స్వేదన చికిత్సలు చేస్తారు. కొన్ని రకాల పొడిపదార్థాలు, తైలాలను ఇందులో ఉపయోగిస్తారు. స్నేమంలో ప్రధానంగా జరిగేది తైలమర్దనమే. దీన్నే అభ్యంగనం అని అంటారు. మర్దన సమయంలో తైలం చర్మం పైనుంచే రంధ్రాల ద్వారా శరీరం కణజాలానికంతటికీ చేరుతుంది. ఆ తర్వాత చేసే స్వేదనం అంటే స్టీమ్ వల్ల శరీరంలోని వ్యర్థపదార్థాలన్నీ కరిగిపోతాయి.

అంతరచికిత్స

చర్మం పైనే చేసే ప్రక్రియగానే అనిపించినా శరీరంలోని సమస్త కణజాలాలు సప్తధాతుల్లోని విషపదార్థాలను కడుపులోకి పంపించడంలో ఈ ప్రక్రియ అద్భుతంగా తోడ్పడుతుంది. కడుపులోకి వచ్చిన వ్యర్థపదార్థాలను బయటికి పంపించడానికి అనుసరించే విధానాల్లో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆ తర్వాత చేయబోయే వమన, విరేచనాల్లో రోగి శారీరక స్థితి, శరీర ధర్మాన్ని అనుసరించి వారు ఆహారంలో ఏరకమైన తైలాలను తీసుకోవాలి? ఏ రకమైన కూరగాయలను వాడాలనే నియమాలు కూడా ఉంటాయి. గాలి తాకేందుకు వీలుగా, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించడం కూడా చాలా ముఖ్యం. వ్యర్థాలను బయటకు పంపిన తర్వాత కడుపులోకి ఇచ్చే మందులు శరీరానికంతటికీ పూర్తిస్థాయిలో పట్టే అవకాశం ఉంది. ఏమైనా పంచకర్మ చికిత్సలు అన్నపుడు అందులోని పూర్వకర్మ, ప్రధానకర్మ, పశ్చాత్ కర్మ అనే మూడింటిని విధిగా తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే సొరియాసిస్ నుంచి విముక్తి లభిస్తుంది.
Drnrama

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles