సొరియాసిస్.. ఇలా పోయింది!


Wed,January 6, 2016 12:04 AM

నాకు 32 ఏళ్లు. 8 ఏళ్ల క్రితం థైరాయిడ్ సమస్య మొదలైంది. అప్పటినుంచి నెలసరి రెండునెలలకు ఒకసారి వచ్చేది. తీవ్రమైన మలబద్దకం. రెండేళ్ల తరువాత నుంచి తల భాగంలో పొట్టు రాలడం, దురద, వెంట్రుకలు రాలిపోవడం మొదలైంది. వరుసగా రెండు రోజుల పాటు స్నానం చేయకపోతే తల దువ్వినప్పుడు చేప పొట్టులా వచ్చేది. అది చుండ్రేమోనని యాంటి డాండ్రఫ్ షాంపూలు వాడాను. కాని ఫలితం లేదు. సంవత్సరం తరువాత మోచేతుల దగ్గర ఎర్రని గుళ్లలు ఏర్పడి బాగా దురద పెట్టేది. వాటి నుంచి పొట్టు రాలుతుండేది. చర్మం బాగా ఎండిపోయేది. పైపూత మందులు వాడినా ఫలితం లేదు. ఇది సొరియాసిస్ అనీ, దీనికి శాశ్వత చికిత్స లేదనీ చెప్పారు.

అలా బాధపడిన మాధవి రెండేళ్ల క్రితం మా వద్దకు వచ్చింది. ఆమెకు హైపోథైరాయిడిజం వల్ల నెలసరి దెబ్బతిన్నది. దీనికి తోడు హార్మోన్ల అసమతుల్యత. మలబద్దకం వల్ల పేరుకుపోయిన వ్యర్థపదార్థాలు శరీరాన్ని విషతుల్యం చేశాయి. మానసిక ఒత్తిళ్లతో సమస్య మరింత తీవ్రమైంది. ఆమెకు ఉన్నది సొరియాసిస్ అని గుర్తించడంలో కలిగిన ఆలస్యం, వేరే మందుల దుష్ప్రభావం అన్నీ కలిసి శరీరం అస్తవ్యస్తం అయింది. ఇంకా ఆలస్యమైవుంటే సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో కీళ్లన్నీ వంకర్లు పోయేవి. మేము వెంటనే పంచకర్మ చికిత్సలు చేసి వ్యర్థ, విష పదార్థాలను పూర్తిగా తొలగించాం. ఆ తరువాత కడుపులోకి కొన్ని ఔషధాలు ఇచ్చాం. దీంతో మూలాలతో సహా వ్యాధి తొలగిపోయింది. 30 రోజుల చికిత్సలతో శరీరం మీదున్న సొరియాసిస్ మచ్చలన్నీ పోయాయి. ఆ తర్వాత వ్యాధి మళ్లీ రాకుండా వ్యాధి నిరోధక శక్తినిచ్చే రసాయనాలిచ్చాం. దీంతో ఆమె సమస్య పూర్తిగా తొలగిపోయి ఇంటా బయటా ఆనందంగా ఉంది.

baaabo


ఎన్ని మందులు వాడినా సొరియాసిస్ శాశ్వతంగా పోదేమో అనుకుంటారు. కాని వ్యాధి లక్షణాలను అణచివేయడం కాకుండా వ్యాధి మూలాలను తొలగించే వైద్యం అందితే దీన్ని శాశ్వతంగా నయం చేయవచ్చు. ఆయుర్వేద వైద్య విధానం దీన్ని సాధించింది. వ్యాధి రావడానికి గల అసలు కారణాలను పరిశీలించి, వాటిని సమూలంగా తొలగించే అన్ని చర్యలూ తీసుకుంటుంది. చర్మం మీదే కనిపించే సొరియాసిస్‌కు సప్త ధాతువులను దెబ్బతీసేంత శక్తి ఉంటుందా అని కూడా కొందరు అనుకుంటారు. నిజానికి సొరియాసిస్‌కు సప్త ధాతువులనే కాదు, సమస్త శరీర వ్యవస్థలనూ ధ్వంసం చేసే తత్వం ఉంటుంది. అలా ధాతువులు క్షీణిస్తూ వెళ్లే కొద్దీ శరీరంలో వాతం పెరిగిపోతుంది. ఒక్క వాతం సంతులనం కోల్పోతే ఆ ప్రభావంతో మిగతా పిత్తం, కఫం కూడా సంతులనం కోల్పోతాయి. అయితే చికిత్సా విధానాలతో ఒక్క వాతాన్ని తిరిగి సాధారణ స్థితికి తెస్తే, పిత్త, కఫాలు కూడా సాధారణం అవుతాయి. అందుకే ఆయుర్వేదం వాత నియంత్రణకు అధిక ప్రాధాన్యాన్నిస్తుంది.

ఆయుర్వేదమే అసలైన వైద్యం


సొరియాసిస్ మచ్చలు చర్మం మీదే కనిపిస్తున్నాయని పై పై వైద్యాలకే పరిమితమైతే సొరియాసిస్ రోజురోజుకూ పెరుగుతుంది. అందుకే కేవలం బాహ్య చికిత్సలకో లేదా ఔషధాలకో పరిమితమైతే సొరియాసిస్‌కు అది పరిపూర్ణ వైద్యం కాదు. దీనికి కారణమైన ఆమాన్ని అటే విషపదార్థాలను ముందు పంచకర్మల ద్వారా తొలగించాలి. అపుడు వాతం నియంత్రణలోకి వస్తుంది.

ravikumar


వాతం నియంత్రణలోకి రాగానే మిగతా పిత్త, కఫాలు కూడా అదుపులోకి వస్తాయి. అప్పుడే సొరియాసిస్ సమూలంగా తొలగిపోతుంది. ఆయుర్వేద చికిత్సలు మొదలైన 25 రోజులకే సొరియాసిస్ మచ్చలు బాగా తగ్గిపోతాయి. ఆ తరువాత వ్యాధిని సమూలంగా తొలగించడానికి మరో మూడు నాలుగు నెలల పాటు కడుపులోకి మందులు తీసుకోవాలి. అన్నీ కలిసి సొరియాసిస్‌తో పాటే వచ్చిన నరాల సమస్యలు, వెన్ను, కీళ్ల సమస్యలను తగ్గిస్తాయి. ఆయుర్వేద వైద్య చికిత్సల తరువాత శరీరం మీద సొరియాసిస్ ఛాయలే కనిపించవు.

1945
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles