సొరియాసిస్‌కు ఆయుర్వేదమే పరిష్కారం


Thu,August 31, 2017 01:32 AM

psoriasis
ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం వల్ల పీల్చే గాలి, తీసుకునే ఆహారం ఏవీ ఆరోగ్యకరంగా ఉండడం లేదు. ఈ కాలుష్యం శరీర అంతర్భాగాలతో పాటు ఈ కలుషితాలు చర్మాన్ని కూడా రోగగ్రస్తం చేయకుండా వదిలిపెట్టవు. చర్మం మీద అక్కడక్కడ మచ్చలు ఏర్పడి విపరీతమైన దురద, మంటతో పాటు చేపపొలుసుల్లా చర్మం రాలిపోతుంది. దీన్ని సొరియాసిస్ అని అంటారు.

వ్యాధి మూలాలకు వైద్యం

రోజూ తీసుకునే కలుషిత ఆహార పానీయాల వల్ల శరీరంలో ఎన్నో రకాల వ్యర్థపదార్థాలు పేరుకుపోతాయి. వీటి వల్ల పలురకాల చర్మరోగాలతో పాటు సొరియాసిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఆయుర్వేదంలో ఈ సమస్యకు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని రకాల మందులు వాడినా శాశ్వత పరిష్కారం లభించని సొరియాసిస్ వంటి వ్యాధులకు ఆయుర్వేదం మంచి పరిష్కారాన్ని సూచిస్తుంది. ఈ వ్యాధి తగ్గిపోతుందనే ఆశ పెద్దగా ఉండదు. బాధ కాస్త ఉపశమిస్తే చాలు అని అనుకుంటారు. అలాంటి వారికి స్టెరాయిడ్స్ ఒక్కటే మార్గంగా కనిపిస్తాయి. కానీ ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఆవగాహన లేకపోవడం వల్లే ఇలా లక్షణాలు తగ్గించే చికిత్సలు చేయించుకుంటారు.

ఆయుర్వేద వైద్య విధానం మిగతా అన్ని వైద్య విధానాల కంటే చాలా భిన్నమైంది. వ్యాధికి మూలమైన అసలు కారణాలను పరిశీలించి, వాటిని సమూలంగా తొలిగించేందుకు కావాల్సిన వైద్యం ఇది. సొరియాసిస్ సమస్య చర్మం మీదే కనిపించినప్పటికీ అది ధాతువులను దెబ్బతీసేంత శక్తి కలిగి ఉంటుందని కూడా కొందరు అనుకుంటారు. నిజానికి సొరియాసిస్‌కు సప్తధాతవులనే కాదు, సమస్త శరీర వ్యవస్థలనూ ధ్వంసం చేసే తత్వం ఉంటుంది. అలా ధాతువులు క్షీణిస్తూ వెళ్లే కొద్దీ శరీరంలో వాతం కూడా పెరిగిపోతుంది. దీంతో పిత్త, కఫాల్లోనూ తేడా వస్తుంది. చికిత్సలో ఒక్క వాతాన్ని సరిచేస్తే మిగిలిన పిత్త, కఫాలు కూడా సాధారణ స్థితికి వస్తాయి. అందుకే ఆయుర్వేదం వాత నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది.
ramakrishnareddy

ఆయుర్వేదమే మార్గం

పై పూతల వైద్యం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వీటితో సొరియాసిస్‌ను ఏమాత్రం అదుపు చెయ్యడం కుదురదు. సొరియాసిస్‌కు కారణమైన విషపదార్థాలను ముందు పంచకర్మ చికిత్సల ద్వారా తొలిగించాలి. ఆ తర్వాత ధాతువుల్ని నివారించే ఔషధాలు కూడా ఇవ్వాలి. వమనం, విరేచన కర్మల ద్వారా శరీరంలోని మలినాలను తొలగిస్తే వాతం అప్పుడు నియంత్రణలోకి వస్తుంది. వాతం నియంత్రణలోకి రాగానే మిగతా పిత్త, కఫాలు కూడా అదుపులోకి వస్తాయి. అప్పుడే సొరియాసిస్ సమూలంగా తొలిగిపోతుంది. ఆయుర్వేదం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారాన్ని సూచిస్తుంది. సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించే ఒకే ఒక మార్గం ఆయుర్వేదం మాత్రమే.

498
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles