సొరియాసిస్‌కు ఆయుర్వేదం


Wed,April 12, 2017 11:52 PM

వ్యాధి మూలానికి వైద్యం అందకపోతే సొరియాసిస్‌ను పూర్తిగా తగ్గించడం సాధ్యపడదు. ఆయుర్వేదంలో సొరియాసిస్‌కు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వ్యాధికి మూల కారణాన్ని పరిశీలించి దానికి సమూల చికిత్స అందిస్తుంది. సొరియాసిస్ వల్ల శరీరంలోని సప్తధాతువులతో పాటు అన్ని వ్యవస్థల మీద ప్రభావితమవుతాయి. ధాతువులు క్షీణించే కొద్దీ వాతం పెరిగిపోతుంది. ఫలితంగా మిగిలిన పిత్త, కఫాలు కూడా సంతులనం కోల్పోతాయి. అయితే, చికిత్సా విధానాలతో ఒక్క వాతాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం వల్ల మిగిలిన అన్ని వ్యవస్థలు తిరిగి యథా స్థితికి వస్తాయి.
Psoriasis

నాడులకు నష్టం జరిగితే?


వ్యాధి నిరోధక శక్తి శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. నిద్రలేమి, వాత ప్రకోపం వల్ల సొరియాసిస్ బాధితుల్లో నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్నీ పాడవుతాయి. ప్రత్యేకించి ప్రొటీన్ అంతా మృతకణాల రూపంలో బయటకు వెళ్లిపోవడం వల్ల నాడీ వ్యవస్థకు చాలా నష్టం జరుగుతుంది. అందువల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్, లాంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలు వస్తాయి.

హార్మోన్లలో తేడాలు


జీవక్రియలన్నీ హార్మోన్‌ల అదుపులోనే ఉంటాయి. సొరియాసిస్ కారణంగా పెరిగే ఒత్తిడి వల్ల వచ్చే పరిణామాల కారణంగా మెదడులో జరిగే రసాయనిక మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ మార్పుల వల్ల మొత్తం మన నాడీవ్యవస్థను నియంత్రించే మెదడులో వచ్చే మార్పులు అడ్రినల్ గ్రంథిని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా శరీరంలోని ముఖ్యమైన అవయవాలన్నింటి మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.
balaji

ఆయుర్వేదమే సరైన సమాధానం


బాహ్య చికిత్సలతో సొరియాసిస్‌కు పరిపూర్ణ వైద్యం అందదు. సొరియాసిస్‌కు కారణమైన విషపదార్థాలను ముందు పంచకర్మ చికిత్సల ద్వారా తొలగించాలి. ఆ తర్వాత ధాతు క్షయాన్ని నివారించే ఔషధాలు కూడా ఇవ్వాలి. వమనం, విరేచన కర్మల ద్వారా శరీరంలోని మలినాలన్నీ తొలగిస్తే వాతం నియంత్రణలోకి వస్తుంది. తర్వాత పిత్త, కఫాలు కూడా అదుపులోకి వస్తాయి. అప్పుడే సొరియాసిస్ సమూలంగా తొలగిపోతుంది. ఆయుర్వేద చికిత్సలు మొదలైన 25 రోజులకే సొరియాసిస్ మచ్చలు బాగా తగ్గిపోతాయి. ఆ తర్వాత వ్యాధిని సమూలంగా తొలగించడానికి మరో 3,4 మాసాలపాటు కడుపులోకి ఇచ్చే ఔషధాలు తీసుకోవాలి. వీటితో సొరియాసిస్ వల్ల వచ్చిన ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆయుర్వేదం సొరియాసిస్‌ను సమూలంగా, శాశ్వతంగా తొలగించి తీరుతుంది. వైద్య చికిత్సలు పూర్తి అయిపోయిన తర్వాత శరీరం మీద సొరియాసిస్ ఛాయలే కనిపించవు.

608
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles