సొంత లాభం కొంత మానుకొని!


Fri,April 12, 2019 01:09 AM

నిరుపేదలయిన వృద్ధులు, అభాగ్యులయిన అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు తాము బతుకుతూనే వారికీ బతుకును చూపిస్తున్నారు తమిళనాడుకు చెందిన వృద్ధ దంపతులు. వారిద్దరూ ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బుతో సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి సాయపడుతున్నారు. వయసుమళ్లిన వారికే కాకుండా ఎటువంటి ఆశ్రయం లేనివారికి సైతం ఉచితంగా వసతి, భోజనం, వైద్య సేవలు అందిస్తున్నారు.
tnoldagehome
తమిళనాడులోని తిరునగర్‌కు చెందిన జలజ, జనార్థనన్ దంపతులు నిరాశ్రయులైన వృద్ధులకు, ఆనాథలకు ఆశ్రయం కల్పించాలని సంకల్పించారు. అటువంటి వారి సంక్షేమం కోసం తమ వేతనాలను వెచ్చిస్తున్నారు. తిరునగర్‌కు చెందిన జలజ, జనార్థన్ దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. జలజ 20 ఏండ్ల పాటు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగిగా పనిచేసింది. సంఘసేవ చేయాలనే ఉద్దేశంతో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనుకుంది. దీంతో 1994లో వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నది. ఆమె భర్త జనార్థనన్ భారత్ సంచార్‌నిగమ్ లిమిటెడ్(బిఎస్‌ఎన్‌ఎల్)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జలజ, జనార్థనన్ దంపతులు ఉద్యోగం చేసే సమయంలో దాదాపు 10 నుంచి 15 మంది భిక్షాటనకు వచ్చిన వారికి తమ వంతుగా సాయం అందించేవాళ్లు. ఆ సమయంలో అనాథశరణాలయం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అందుకోసం తమ ఇరువురి వేతనాల్లో 25 శాతం డబ్బును కేటాయించారు. ఆ డబ్బుతో మొదటగా 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 మంది వృద్ధులకు సేవలందించడం ప్రారంభించారు. జలజనే స్వయంగా అనాథల కోసం భోజనం వండి పెట్టేది. అక్కడ ఉండే వారికి భోజనం, వసతి, అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నారు. కొద్దిరోజుల తర్వాత ఇప్పుడున్న ఆశ్రమం పక్కనే మరికొంత స్థలాన్ని కొనుగోలు చేసి మరింతమందికి ఆశ్రయం కల్పించాలనే ఆలోచనతో ఇంకొంచెం పెద్ద భవనాన్ని నిర్మించారు. 2002లో జనార్థనన్‌కు కంటివ్యాధి రావడంతో కంటిచూపు బాగా తగ్గింది. అయినా ఏమాత్రం బాధపడకుండా తమ లక్ష్యం కోసం జలజ, జనార్థనన్ కృషిచేస్తున్నారు. ప్రస్తుతం నూతనంగా నిర్మించిన భవనంలో 100 మందికి పైగా ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారు.

274
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles