సైలెంట్ కిల్లర్.. స్వైన్‌ఫ్లూ


Mon,February 4, 2019 11:55 PM

మారుతున్న వాతావరణం.. విస్తరిస్తున్న వైరస్..విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్.. వీటిలో ప్రతీది జలుబుతోనే ప్రారంభమవుతుంది. జలుబే కదా.. అని లైట్ తీసుకోకండి. అది లైఫ్‌ను ఇబ్బంది పెట్టే స్వైన్‌ఫ్లూ కూడా అయుండొచ్చు. అప్రమత్తంగా ఉండి.. అపాయం నుంచి బయటపడి.. స్వైన్‌ఫ్లూ వ్యాధికి స్వస్తి చెప్పండి!
HINI

స్వైన్‌ఫ్లూ ప్రమాదకరం అని తెలుసు కానీ.. మరీ ప్రా ణాలు తీసేంత డేంజరా అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అలా ఆందోళన చెందడం కాకుండా వ్యాధిపట్ల అవగాహన.. దాని తీవ్రత పట్ల అప్రమత్తత కలిగి ఉంటేనే స్వైన్‌ఫ్లూను అరికట్టవచ్చు. గతంలో సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకేది. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా స్వైన్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తూనే ఉంది.

జనవరి ఒకటవ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 2,572 కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆందోళన కలిగించే ఇంకో విషయం ఏంటంటో స్వైన్‌ఫ్లూ సోకినవారిలో 77 మంది మృతి చెందారు. అత్యధికంగా రాజస్థాన్‌లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60% రాజస్థాన్‌కు సంబంధించినవేనట. రాజస్థాన్ తర్వాత గుజరాత్.. ఢిల్లీ.. హర్యానాలో ఇది విజృంభిస్తున్నది. మెల్లగా దక్షిణాది రాష్ర్టాలకు విస్తరించి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నది.

ఎలా వ్యాపిస్తుంది?

స్వైన్‌ఫ్లూ హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వల్ల సోకుతుంది. దగ్గు.. తుమ్ముల ద్వారా వైరస్ గాలిలోకి వ్యాపిస్తుంది. ఆ గాలిని పీల్చితే వారి శరీరంలోకి స్వైన్‌ఫ్లూ వైరస్ చేరుతుంది. రోగుల తుం పర్లు.. ఉమ్మిలోనూ వైరస్ ఉంటుంది. పొ రపాటున వాటిని తాకితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఎవరికి సోకుతుంది?

అన్ని వయసుల వారికి హెచ్1ఎన్1 వైరస్ సోకుతుంది. ముఖ్యంగా పిల్లలు.. వృద్ధులకు తొందరగా వస్తుంది. ఆస్తమా.. డయాబెటీస్.. స్థూలకాయం.. గుండె జబ్బులు.. తక్కువ రోగ నిరోధకశక్తి ఉన్నవారికి.. గర్భిణులకు ఈ వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలేంటి?

ఇది సాధారణ జలుబుగా ప్రారంభం అవుతుంది. సుమారు ఆరు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. విడువని జ్వరం.. తలనొప్పి.. గొంతునొప్పి స్వైన్‌ఫ్లూ ప్రధాన లక్షణాలు. ఆయాసం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఒళ్లు నొప్పులు.. తీవ్ర నీరసం.. ముక్కు కారడం.. విడువని దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు.. విరేచనాలు కూడా అవుతుంటాయి. వైరస్ ఎప్పుడూ మన చుట్టూ, గాలిలో ఉంటూనే ఉంటుంది. దీంతో ఎప్పుడైనా, ఎవరికైనా వ్యాధి రావచ్చు. కాకపోతే చలికాలంలో ఈ వైరస్ వాతావరణంలో ఎక్కువకాలం బతికి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత 40 డిగ్రీలపైన ఉంటే వైరస్ వాతావరణంలో త్వరగా చచ్చిపోతుంది. చల్లటి, పొడి వాతావరణంలో ఎక్కువ కాలం బతికి ఉంటుంది. అందుకే చలికాలంలో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

ఎలా గుర్తిస్తారు?

జ్వరంతో పాటు జలుబు చేసినప్పుడు ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల నమూనాలను సేకరిస్తారు. పీసీఆర్ పరీక్ష ద్వారా వైరస్ ఉందా లేదా తెలుసుకుంటారు. ఒకవేళ దానిని స్వైన్‌ఫ్లూ వైరస్ అని నిర్ధారిస్తే మార్కెట్‌లో నివారణ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి డోసు ఇచ్చాక మూడు వారాలు ఆగి.. మరో డోసు ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరానికి రెండు వారాల సమయం పడుతుంది.

రోగ నిరోధకశక్తి పెరగాలంటే?

రోగ నిరోధకశక్తిని పెంచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. తగినంత నిద్రపోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. పండ్లు.. పండ్ల రసాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నమలాలి. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు గోరువెచ్చటి నీటితో తింటే మంచి ప్రయోజనం ఉంటుంది. గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. దాల్చిన చెక్క.. లవంగాలతో చేసిన చాయ్ తాగితే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. సీజనల్ పండ్లను తినడం ద్వారా రోగాల నుంచి తప్పించుకోవచ్చు.
swine-flu

తీవ్రమైన సమస్యలు

స్వైన్‌ఫ్లూ నిజంగానే సైలెంట్ కిల్లర్. ఇది ఎలా అంటే అలా టర్న్ తీసుకోగలదు. న్యుమోనియాగా.. ఏఆర్‌డీఎస్‌గానూ మారవచ్చు. ఏఆర్‌డీఎస్ అనేది తీవ్ర కాలేయ సమస్య. ఒక్క వెంటిలేషన్ మీదనే ఆధారపడి చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల. స్వైన్‌ఫ్లూ వల్ల సెకండరీ బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఏర్పడుతాయి. అంటే కుటుంబంలో ఎవరికైనా ఒకరికి స్వైన్‌ఫ్లూ సోకితే ఆ కుటుంబంలో హైరిస్క్ ఫ్యాక్టర్ కలిగిన వారికి వెంటనే ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోగా సత్వర చికిత్స చేయించడం మంచిది. వీటివల్ల మరణాలను నివారించవచ్చు. పరీక్షల ద్వారా ఫ్లూ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అయితే చికిత్స పొందేందుకు పరీక్ష ఫలితాల కోసం వేచి చూడటం కాకుండా చికిత్స చేయించుకోవడం శ్రేయస్కరం.
Virus

జాగ్రత్తలు

స్వైన్‌ఫ్లూ బారినుంచి తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. పరిశుభ్రత చాలా అవసరం. వీలైనన్నిసార్లు చేతులు కడుక్కోవాలి. దగ్గినప్పుడుగానీ.. తుమ్మినప్పుడు గానీ ముక్కు కు. నోటికి కర్చీఫ్ అడ్డుగా పెట్టుకోవాలి. చిన్నారులకు ముందుగానే సీజనల్ ఫ్లూ నివారణకు వ్యాక్సిన్లు వేయించాలి. బయటకు వెళ్లేవారు మూతికి సర్జికల్ మాస్క్ లేదా కర్చిఫ్ చుట్టుకోవాలి. జ్వరంతోపాటు తలనొప్పి.. గొంతునొప్పి.. దగ్గు.. ఒంటి నొప్పులు.. తీవ్రమైన నీరసం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
NALINI

ఎప్పుడు మొదలైంది?

మెక్సికోలో తొలిసారిగా 2009లో స్వైన్‌ఫ్లూ కేసు నమోదయ్యింది. పందుల నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని గుర్తించారు. ఒక్క 2009లోనే 14,83,520 మంది స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. 18449 మంది ప్రాణాలు కల్పోయారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. క్రమేపీ దీని ఉధృతి తగ్గటంతో తిరిగి 2010లో స్వైన్‌ఫ్లూ నుంచి ఎలాంటి ముప్పు లేదని ప్రకటించింది.

868
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles