సైనసైటిస్‌కు హోమియో చెక్


Tue,January 26, 2016 10:58 PM

face

నిరంతరం జలుబుతో ముఖమంతా వాచిపోయి, తలంతా బరువుగా ఉండి, జీవితాన్ని నిస్తేజం చేసే సమస్య సైనసైటిస్. ఏళ్ల తరబడి వేధించే ఈ సమస్యకు హోమియోలో అద్భుతమైన వైద్యం ఉంది.
వైరస్, బాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా సైనస్‌లలో విపరీతమైన నొప్పి పుడితే దాన్ని సైనసైటిస్ అంటారు. ముక్కు, కళ్ల చుట్టూ నాలుగు గదులుంటాయి. వాటిని సైనస్‌లంటారు. మనం శ్వాస పీల్చినప్పుడు గాలి ముక్కు నుంచి సైనస్‌లలోకి వెళ్తుంది. మనం పీల్చే గాలిని సమశీతోష్ణస్థితికి తెచ్చే బాధ్యతను ఇవి నిర్వర్తిస్తాయి. సైనస్‌ల నుంచి వచ్చే ద్రవాలు ముక్కు ద్వారా బయటకు వెళతాయి.

కారణాలు
సైనస్ ముఖద్వారం మూసుకుపోతుంది. లేదా అక్కడ చాలా మ్యూకస్ పేరుకుపోతుంది. ఫలితంగా అక్కడ బాక్టీరియా, ఇతర క్రిములు సులభంగా పెరిగి, సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. శ్వాసకోశ మార్గానికి ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల సైనస్‌లకు బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫలితంగా తీవ్రమైన సైనసైటిస్ సమస్య మొదలవుతుంది. కొందరిలో సైనస్‌లలో వాపు రావడంతో పాటు బాగా నొప్పిగా ఉంటుంది. చాలాకాలం పాటు ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉండిపోతుంది. దీన్ని క్రానిక్ సైనసైటిస్ అంటారు.

లక్షణాలు
తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడడం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తరువాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోతాయి. తల అంతా బరువుగా ఉంటుంది. ఆపైన ముక్కు నుంచి పసుపు పచ్చని, ఆకుపచ్చని ద్రవాలు రావడం మొదలవుతుంది.
తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస, దుర్గంధంతో కూడి ఉండడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలతో పాటు కొందరిలో నిరంతరం ముక్కులో దురదగా ఉంటుంది. ముఖం, తల అంతా బరువుగా ఉంటుంది. ఒక దశలో ముక్కు వెనుక భాగం నుంచి మ్యూకస్ గొంతులోకి వెళ్తుంది (పారాసాసల్ డ్రిప్).
ముఖంలో వాపు కనిపిస్తుంది. పళ్లు, కళ్ల వెనుక భాగంలో కూడా నొప్పి కనిపిస్తుంది. కొద్ది రోజులకు వాసన తెలియకుండా పోతుంది. గొంతు మంటగా, నోరంతా చేదుగా మారుతుంది. కొందరిలో చెవి వినిపించకుండా పోతుంది. అలసటతో పాటు తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించిన ఆ వ్యక్తి సైనసైటిస్‌తో బాధపడుతున్నారని భావించాలి.

వ్యాధినిర్ధారణ, పరీక్షలు
ఏ సైనస్‌లకు సమస్య ఉంటే ఆ భాగంలో నొప్పి, మొద్దుబారినట్టు అవుతుంది. కంటికి పై భాగంలో ఉండే సైనస్‌లకు సమస్య వస్తే కళ్ల కింది భాగం, పై దవడ, పళ్లు నొప్పిగా ఉంటాయి. రెండు కళ్ల మధ్య భాగంలో ఉండే సైనస్‌కు సమస్య వస్తే ముక్కు చుట్టు పక్కల అంతా నొప్పి వస్తుంది. కళ్ల చుట్టూ కూడా వాపు వస్తుంది. ముఖం లోపలి భాగాలకు సైనస్ సమస్య వస్తే తల, చెవి, మెడ నొప్పి వస్తుంది. సైనస్ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేరు. కొన్ని పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను గుర్తించవచ్చు. ఫైబర్ ఆప్టిక్ స్కోప్ ద్వారా వ్యాధి నిర్ధారణ సులువవుతుంది. కొన్ని సందర్భాల్లో సీటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఎంఆర్‌ఐ చేయించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇతర రక్త పరీక్షల ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

చికిత్స
హోమియోపతి చికిత్సలో సర్జరీ అవసరం లేకుండానే సైనసైటిస్‌ను సమూలంగా తగ్గించుకోవచ్చు. హోమియో మందులతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇతర చికిత్సల వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదు. కాని హోమియో చికిత్స వల్ల సైనసైటిస్ సమస్య సమూలంగా తొలగిపోతుంది. మళ్లీ మళ్లీ బాధించదు.

murali

1891
Tags

More News

VIRAL NEWS