సైనటైటిస్‌కి శాశ్వత పరిష్కారం


Wed,January 20, 2016 01:45 AM

OddTrick

తీవ్రంగా బాధించే సైనసైటిస్ ఇటీవలి కాలంలో ఎక్కువ మందిని బాధిస్తోంది. సైనస్ సమస్యతో బాధపడేవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారు. హోమియో చికిత్సతో దీనికి శాశ్వత పరిష్కారం అందించవచ్చని చాలామందికి తెలియదు.
మన తల భాగంలో గాలితో నిండిన గదులను సైనస్‌లంటారు. ఈ సైనస్‌లు నుదుటి దగ్గర, కళ్ల కింది భాగంలో తల వెనుక భాగంలో ఉంటాయి. ఇవి ఉండే ప్రాంతాలను బట్టి మాగ్జిలరీ సైనస్‌లు, ఇత్‌మాయిడ్ సైనస్‌లు, ఆక్సిపీటర్ సైనస్‌లు, ఫ్రాంటల్ సైనస్‌లని అంటారు. ఇవి సైనస్ మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొరతో కప్పబడి ఉంటుంది. ఈ పొరలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లనే సైనసైటిస్ అంటారు. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే క్రానిక్ సైనసైటిస్‌గా మారుతుంది.

కారణాలు
దుమ్ము, పెంపుడు జంతువుల వెంట్రుకలు, వాతావరణంలో మార్పులు, త్వరత్వరగా జలుబుచేసే తత్వం, శీతల పానీయాలు, కొన్ని రకాల పుప్పొడి రేణువులు సైనసైటిస్‌కు ముఖ్య కారణాలు. ఇవే కాకుండా ముక్కుదూలం వంకర వల్ల, పాలిప్స్ వల్ల సైనస్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
వాతావరణంలో తేమ, చల్లదనం ఉన్నప్పుడు సైనస్ వచ్చే అవకాశం ఎక్కువ.

లక్షణాలు
తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి నీరు కారడం, కంటి దురద, గొంతునొప్పి, దగ్గు, జ్వరం, కళ్ల చుట్టూ వాపు రావడం, నల్లని వలయాలు కంటి చుట్టూ ఏర్పడడం, కళ్లు తిరగడం, ఒళ్లు నొప్పులు సైనస్ సంబంధిత లక్షణాలు.

నిర్ధారణ
రోగ లక్షణాలను బట్టి కొన్ని రకాలైన పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.

హోమియో చికిత్స
హోమియో మందులు సైనస్ ఇన్‌ఫెక్షన్‌లను తగ్గించి, రోగిని ఆరోగ్యవంతునిగా చేస్తాయి. రోగి లక్షణాలు, శరీర తత్వాన్ని బట్టి హోమియో వైద్య విధానంలో చేసే కాన్‌స్టిట్యూషన్ థెరపీ వల్ల సైనసైటిస్ సమస్య శాశ్వతంగా నయమవుతుంది. సైనసైటిస్ సమస్యలకు కాలీబైక్, ఫాస్ఫరస్, సైలీషియా, బ్రయోనియా లాంటి హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయి. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో హోమియో చికిత్స తీసుకుంటే సైనసైటిస్ శాశ్వతంగా దూరం అవుతుంది.

murali

1925
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles