సైకిళ్లు కింద పడిపోకుండా!


Sat,September 8, 2018 11:23 PM

సైకిల్ మీద స్కూల్‌కి వెళ్లి, గ్రౌండ్‌లో పార్క్ చేసి తరగతి గదికి వెళ్తుంటారు. అయితే, గాలికి ఒకదాని మీద ఒకటి పడుతుంటాయి. ఒక్క సైకిల్ కూడా కింద పడకుండా ఉండేలా ఓ వినూత్న ఆలోచన చేశారు ఈ పిల్లలు. స్కూల్ యాజమాన్యం మొత్తం వారిని అభినందించారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..?
cycle-stand
తమిళనాడుకి చెందిన విద్యార్థులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ఇంటికి దూరంగా ఉన్న తమ పాఠశాలకు రోజూ సైకిళ్లపై వెళ్లేవారు. అయితే, ఆ పాఠశాలలో సైకిల్ స్టాండ్ లేదు. దీంతో చెట్ల పక్కనే వాటిని పార్క్ చేసేవారు. పెద్దగాలి వచ్చినా, ఎవరైనా సైకిల్ తీసేందుకు ప్రయత్నించినా.. అన్నీ ఒక్కసారిగా పడిపోయేవి. ఈ క్రమంలో విద్యార్థులకు గాయాలు కావడం, సైకిళ్లు దెబ్బతినడం జరుగుతుండేది. తమ పాఠశాలలో సైకిళ్లు ఒకదానిపై మరొకటి పడుతుండడంతో చాలా ఇబ్బందులు పడేవారు. పాఠశాల యాజమాన్యం కూడా సరిగా స్పందించేది కాదు. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలని నిర్ణయం తీసుకుంటున్నారు విద్యార్థులు. సైకిళ్లు కింద పడకుండా ఉండేందుకు రెండు చెట్లకు మధ్యలో ఓ రాడ్‌ను అమర్చారు. పొడవుగా ఉన్న రాడ్‌ను మధ్యలో వెల్‌క్రో టేపుతో సైకిళ్లను కట్టి ఫిక్స్ చేశారు. రెండు అడుగుల దూరంలో టేపుతో గట్టిగా కట్టడం వల్ల సైకిళ్లు కింద పడకుండా నిలబడేలా ఏర్పాటు చేశారు. ప్రయోగం చేసిన పిల్లలను స్కూల్ యాజమాన్యం అభినందించింది.

626
Tags

More News

VIRAL NEWS

Featured Articles