సైంటిస్ట్ అనుపమ సరికొత్త రికార్డ్


Sat,February 23, 2019 01:42 AM

బెంగళూర్‌కు చెందిన యంగ్ సైంటిస్ట్ డా. అనుపమ భారత ఖగోళశాస్త్రవేత్తల సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఆ సొసైటికీ ఓ మహిళ ఎన్నికవడం ఇదే తొలిసారి.
anupama-india
డాక్టర్ డీసీ అనుపమ కర్ణాటకకు చెందిన మహిళా శాస్త్రవేత్త జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖగోళశాస్త్రంలో ఎన్నో ప్రాజెక్ట్‌లు చేపట్టింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. అమెరికాలోని హవాయిలో 30 మీటర్ల అతిపెద్ద టెలిస్కోప్‌ను నెలకొల్పడంలో కీలకపాత్ర పోషించింది. లఢఖ్‌లోని లెహ్‌లో ఏర్పాటు చేసిన హిమాలయన్ టెలిస్కోప్ ప్రాజెక్టుకు ఇంచార్జ్‌గా పని చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన టెలిస్కోప్ ఇది. ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ యుఆర్ రావు తర్వాత కర్ణాటక నుంచి రెండో వ్యక్తిగా ఈ పదవికి ఎన్నికైంది. సీవీ రామన్ యువ శాస్త్రవేత్త అవార్డును అనుపమా 2001లో అందుకున్నది. 1994 నుంచి ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రానామిక్స్ పూణెలో పని చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తలు అతి తక్కువగా ఉన్నారు. వారిలో మహిళల సంఖ్య మరింత తక్కువగా ఉంది. ఇప్పటి వరకూ ఆ రంగంలో పనిచేస్తున్న మహిళల శాతం ఎనిమిది. యునెస్కో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు ఆ సంస్థలోని ఏ విభాగంలోనూ ఓ మహిళకు పనిచేసే అవకాశం రాలేదు. భారత పరిశోధనా రంగాల్లో పనిచేస్తున్న మహిళా శాస్త్రవేత్తలు 14 శాతం కాగా, ప్రపంచ వ్యాప్తంగా 28.4 శాతం మాత్రమే ఉన్నారు.

874
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles