సేఫ్‌గా ఇంటికి చేర్చే.. మిషన్ స్మార్ట్ రైడ్


Wed,January 23, 2019 01:34 AM

సరదాగా.. సంతోషంగా గడుపొచ్చు.. కానీ ఆ సంతోషం మన కుటుంబం నుంచి దూరం కానివ్వొద్దు. జీవితంలో మనకు నచ్చినట్టుగా మనం ఉండొచ్చు.. కానీ మన లెక్కలేనితనం ఇతరులకు ప్రాణ సంకటం కావొద్దు. మనమే కాదు.. మన వల్ల ఇతరులు కూడా ప్రమాదం బారిన పడొద్దన స్పృహ ఉండాలి. అలా జాగ్రత్తపడే వాళ్లకు సాయపడుతుంది ఈ మిషన్ స్మార్ట్ రైడ్. డ్రింక్ సేఫ్..డ్రైవ్ స్మార్ట్ అన్నదే ఈ మిషన్ ఉద్దేశం.. ఇంతకీ ఈ మిషన్ స్మార్ట్ రైడ్ అంటే ఏంటి? ఈ కథనం చదువండి. మీకే తెలుస్తుంది.
safedrive
ఎదుటివారిపట్ల ఏ శత్రుత్వం లేదు. కనీసం అంతకు ముందు వాళ్లను చూసిన పరిచయమూ ఉండదు. కానీ మీకు తెలియకుండానే మీరు వాళ్ల పాలిట యమకింకరులు అవుతున్నారు. మద్యం మత్తులో ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవడంతోపాటు తమదారిలో తాము వెళుతున్న అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. అన్నింటికీ కారణం ఒక్కటే డ్రంక్ అండ్ డ్రైవ్. మద్యం సేవించడం తప్పా.. ఒప్పా.. అన్న చర్చ పక్కన పెడితే..ఆ మత్తులో ప్రమాదాలకు కారకులు కావడం ఎంతవరకు సమంజసమన్నదే ప్రశ్న? సరిగ్గా అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే మిషన్ స్మార్ట్ రైడ్. మద్యం మత్తులో స్నేహితుడు కండ్లముందే ప్రాణాలు విడువడం భాగి నంద సాండిల్యను తీవ్రంగా కలచివేసింది. అమెరికాలో 2006లో జరిగిన ఈ సంఘటన ఆయనను తరుచూ వెంటాడేది. మద్యం సేవించే వారిని క్షేమంగా ఇంటికి చేరుకునేలా చేస్తే.. వారితోపాటు ఎదుటి వాహనదారుల కుటుంబాలను కాపాడవచ్చని నిర్ధారించుకున్నాడు నంద. అలా తన ఆలోచనలకు మిత్రులు, ప్రభుత్వాల సాయం జోడిస్తూ.. మిషన్ స్మార్ట్ రైడ్‌ను అందుబాటులోకి తెచ్చాడు.
YDAW
నా పేరు భాగి నంద సాండిల్య. నేను న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నా. 2006లో నేను నా ఫ్రెండ్ ఒక పార్టీకి అటెండ్ అయ్యాం. తిరిగి వచ్చేటప్పుడు వాడొక్కడే స్పీడుగా నడుపుతున్నాడు. మేం చూస్తుండగానే సిగ్నల్ జంప్ దగ్గర కారు పల్టీ కొట్టింది. వాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ బాధ నాలో ఉండిపోయింది. అలా రోజుకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల నుంచి కాపాడలేమా అని అనిపించింది. ఈ సమస్యపైన నేను సీరియస్‌గా వర్కవుట్ చేయడం మొదలు పెట్టా. అలా పుట్టిందే మిషన్ స్మార్ట్ రైడ్. తాగిన మైకంలో ఉన్న మనకు జస్ట్ ఒక్క క్లిక్‌తో క్యాబ్ లేదంటే మన బండి నడిపేందుకు డ్రైవర్ వచ్చేలా పరిష్కారం కనుక్కోవాలనుకున్నా. మిషన్ స్మార్ట్ రైడ్‌లో ఓలా, ఉబర్ క్యాబ్‌లను ఈజీగా బుక్ చేసుకోవడంతోపాటు ఫస్ట్‌రైడ్‌కు రూ.150 నుంచి రూ.200 వరకు డిస్కౌంట్ వస్తుంది. సో, డ్రింక్‌ను ఎంజాయ్ చేయడమే కాదు, క్షేమంగా ఇంటికి వెళ్లొచ్చు. మిషన్ స్మార్ట్ రైడ్‌ను తొలిసారిగా తెలంగాణలో 2015 డిసెంబర్ 31న ప్రారంభించాం. మిగిలిన రాష్ర్టాల్లో అమలుకు అనుమతులు లభిస్తున్నాయి. అదేవిధంగా అమెరికాలోని న్యూజెర్సీ, డెలవేర్ రాష్ర్టాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్నాం అంటూ ఈ ప్రాజెక్టు గురించి చెప్పాడు నంద.
Drink

సురక్షిత ప్రయాణమే లక్ష్యం..

మిషన్ స్మార్ట్‌రైడ్ కింద ఓలా లేదా ఉబర్ క్యాబ్ బుక్ చేస్తున్నప్పుడు ఆ లొకేషన్ కచ్చితంగా బార్ లొకేషన్ అయ్యి ఉండాలి. అంటే మనం బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్‌కు మనం బార్‌లో, రెస్టారెంట్‌లో ఉన్నట్టుగా లొకేషన్ కనిపించాలన్నమాట. లేదంటే ఈ డిస్కౌంట్ వర్తించదు. మిషన్ స్మార్ట్ రైడ్ ఆలోచన ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. మీరు సొంతంగా బైక్ లేదా కారు నడుపుతూ వెళ్లి తాగిన మత్తులో ప్రమాదాల బారిన పడడం, ఎదుటివాళ్ల ప్రాణాలకు ముప్పు తేవడం కంటే సురక్షిత ప్రయాణానికి మిమ్మల్ని అలవాటు చేయడమే. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ తాగేవారి కోసం ఉద్దేశించింది. అయితే కొందరు తాగకపోయినా, బార్ లొకేషన్‌లో ఉండి క్యాబ్ బుక్ చేసుకునే అవకాశమూ ఉంది. ఇలా కొంతవరకు మిస్‌యూజ్ తప్పదు. అయితే మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారు కాబట్టి క్యాబ్ కంపెనీలు కూడా సేవలందించడానికి ముందుకొస్తున్నాయి.

740
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles