సెపరెట్ స్టయిల్!


Fri,January 25, 2019 02:10 AM

ఒకసారి సంప్రదాయంగా.. మరొకసారి మోడ్రన్‌గా..అకేషన్‌ని బట్టి.. ఆలోచనను బట్టి.. మన డ్రెస్సింగ్ మారుతూ ఉంటుంది.. ఒకసారి ఇతరులకు మ్యాచింగ్‌గా ఉండొచ్చు.. మరొకసారి మనమే సరికొత్తగా కనిపించొచ్చు.. నీ జతగా అని పాడినా.. ఒంటరిగా ఉన్నా.. ఎవరికి వారిదే సెపరెట్ స్టయిల్.. మరి వారి స్టయిల్ స్టేట్‌మెంట్స్‌పై ఓ లుక్కేయండి..
Fashan
1. జోడీలు మ్యాచింగ్ వేసినా బాగుంటారు. కొన్నిసార్లు కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు. నల్లని పట్టు చీర మీద ఏనుగుల డిజైన్ చూడముచ్చటగా కనిపిస్తున్నది. పింక్ కలర్ చిన్న బార్డర్ కూడా కరెక్ట్‌గా ఉంది. నల్లని పట్టు బ్లౌజ్‌కి పింక్ కలర్, గోల్డెన్ జర్దోసీ బాగా వచ్చింది. అమ్మాయిలకు తగ్గట్టుగా ఉండాలంటే.. అబ్బాయిలు సూటు బూటు వేయాల్సిందే! నల్లని ప్యాంట్, దానికి తెల్లని షర్ట్ మ్యాచ్ చేశారు. ఎర్రని వేస్ కోట్ దీనికి మరింత వన్నె తెచ్చింది.

2. ఆరెంజ్ హెవీ బుటీ పట్టు చీరకి.. ప్లెయిన్ బ్లాక్ బార్డర్ బాగా సూటయింది. దీనికి బ్లాక్ వర్క్ బ్లౌజ్‌ని మ్యాచ్ చేశారు. ఇక అబ్బాయికి ఎర్రని కుర్తాకి పైన నల్లని వేస్ కోట్ ఇచ్చారు. ఎడమ వైపు ఎంబ్రాయిడరీతో పూలను కుట్టి హైలైట్ చేశారు. ఎర్రని పైజామా దీనికి సరిగ్గా సరిపోయింది. ఇలా డ్రెస్సింగ్‌తో ఇద్దరు పర్‌ఫెక్ట్ కపుల్‌గా కనిపిస్తున్నారు కదూ!
Fashan1
3. పచ్చని పట్టు చీర అమ్మడి అందాన్ని రెట్టింపు చేసింది. దీనికి సెల్ఫ్ బార్డర్ మరింత మెరిసిపోతున్నది. చివర ఆకుపచ్చని రంగు, మధ్యలో గోల్డెన్, సిల్వర్ డిజైన్ చీర అందాన్ని పెంచింది. ఆకుపచ్చని హై నెక్ బ్లౌజ్ మీద హెవీ జర్దోసీ వర్క్ సూపర్‌గా కనిపిస్తున్నది.

4. ఎక్కడైనా తళుక్కున మెరిసేలా కనిపించేందుకు ఈ డ్రెస్‌లు వేయాల్సిందే! ఎర్రని వెల్వెట్ లెహంగా చోళీ మీద జర్దోసీతో హెవీ వర్క్ వచ్చింది. దీనికి తగినట్టుగానే పీచ్ కలర్ నెట్ దుపట్టా మీద కూడా అదే వర్క్ కంటిన్యూ అయింది. బార్డర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. నల్లని సీక్వెన్స్ డ్రెస్‌ని కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. హై నెక్ లైన్ ఇచ్చి అక్కడ డిఫరెంట్ వర్క్‌తో నింపేశారు. ఫుల్ స్లీవ్స్ పర్‌ఫెక్ట్‌గా సూటయ్యాయి. నల్లని ప్యాంట్, నెట్ దుపట్టా వీటికి బాగా సూటయ్యాయి.

646
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles