సూర్యకిరణాలతో అద్భుత కళాఖండాలు!


Thu,March 7, 2019 12:41 AM

సృజనాత్మకత ఒక్కొకరిలో ఒక్కో విధంగా ఉంటుంది. అందరూ చేసేపనిని సరికొత్త మార్గంలో చేస్తే దానికి తప్పకుండా ఆదరణ లభిస్తుంది. సరిగ్గా ఆ కోవకు చెందిన ఈ కళాకారుడు వినూత్న రీతిలో చిత్రాలను వేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
solar-artist
సౌరశక్తిని విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈ యువ కళాకారుడు ఎటువంటి బ్రష్ లేకుండానే ఎంతో అందమైన చిత్రాలు గీస్తూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటున్నాడు. అమెరికాలోని కొలరాడొకు చెందిన మైఖేల్ పపడకిస్ కుంచె పట్టకుండానే సౌరశక్తిని ఉపయోగించి అద్భుతమైన బొమ్మలు వేస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు. సూర్యకిరణాలనే పెయింటింగ్ బ్రష్‌గా మలుచుకుని భూతద్దం ద్వారా చెక్కపై బొమ్మలు వేసే విధానాన్ని హేలియో గ్రాఫ్ ఆర్ట్ వర్క్ అని అంటారు. మైఖేల్ ప్రకృతి, మనుషులు, జంతువులు, పక్షుల వంటి బొమ్మలను గీస్తుంటాడు. ఒక్కో బొమ్మ వేయడానికి 5 గంటల నుంచి 50 గంటల సమయం పడుతుంది. మబ్బులు పట్టి ఉంటే సూర్యుడి కిరణాలు నేలపై పడవు కనుక అటువంటి సమయాల్లో మైఖేల్ గీసే బొమ్మలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంటుంది. మైఖేల్ పపడకిస్ తన విద్యను పది మందికి అందించాలనే ఉద్దేశ్యంతో పాఠశాల విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

271
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles