సూరత్ చీరలపై సైనికుల చిత్రాలు!


Tue,March 5, 2019 12:32 AM

ఫిబ్రవరీ 14న పుల్వామా దాడిలో బలిగొన్న 40మంది జవాన్లను కోల్పోయిన బాధ నుంచి యావత్ భారత్ కోలుకోలేదు. పాక్‌పై మెరుపుదాడితో కొంత ఊపిరి పీల్చుకున్నది. ఈ పోరాటంతో చీరల వ్యాపారిలో వినూత్న ఆలోచన వచ్చింది. యుద్ధ సైనికుల ఫొటోలను చీరలపై ప్రింటింగ్‌గా రూపుదిద్దాడు. దీంతో కొన్ని విమర్శనలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
saree
గుజరాత్‌లోని సూరత్‌ట్రేడర్స్ చీరల వ్యాపారీ వినోద్ కుమార్ కొత్తగా ఆలోచించాడు. తయారు చేసే చీరల మీద ఆర్మీ ఫొటోలను ప్రింట్ చేస్తే బాగుంటుందనుకున్నాడు. మంచి ఆలోచన కదా అనుకున్నారు అందరూ. కానీ, ఇండియన్ ఆర్మీకి బదులుగా అమెరికా సైన్యాన్ని ఫ్రింట్ చేశారు. ప్రింటింగ్ తరువాత చూడండంటూ జూ బేర్ యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. భారతీయపౌరులై ఉండి అమెరికా సైనికుల ఫొటోలతో ప్రింటింగ్ చీరలను తయారుచేస్తున్నారా? అంటూ కొంతమంది భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్ముడు పోవడానికి అమెరికా సైనికులను ఎంచుకొని భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్లు వాపోతున్నారు. ఆ చీరల మీద సైనికులు యుద్ధానికి పోతున్న విధానాన్ని స్పష్టంగా తెలియజేశారు. సైనికులతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫొటోలను కూడా ప్రింట్ చేశారు. నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో ఫిబ్రవరి 26 తెల్లవారుజామున జరిగిన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి చేసింది. పాక్ పోరులో మన సైనికులు చూపించిన సాహసం, తెగువ చూసి గర్వంతో పొంగిపోయి ఆ ఘట్టాన్ని మరింత మందికి చేరవేసేందుకు ఇలా డిజైన్ చేశానని వినోద్ బదులిచ్చాడు. ఇదంతా ఆదాయం కోసం చేసింది కాదు. వచ్చిన డబ్బుని సూరత్‌లోని అన్నపూర్ణ ఇండస్ట్రీస్ ద్వారా సిఆర్‌పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందిస్తామని మిల్స్ అధినేత చెప్పారు. చీర తయారీకి ఏడురోజుల సమయం పడుతుంది. పట్టుదలతో దీన్ని నాలుగు గంటల్లో పూర్తి చేశాము. ఇప్పుటికే ఈ చీరకి ఇప్పటికే రెండువేలకు పైగా ఆర్డర్స్ వచ్చాయని వినోద్ వివరించారు.

377
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles