సురక్షిత దేశమేది?


Fri,February 1, 2019 12:11 AM

iceland
ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశం ఏది అంటే? ఠక్కున అమెరికా వంటి దేశాల పేర్లు చెబుతారు. కానీ కాదు. ప్రపంచంలోని దేశాల్లో అత్యంత సురక్షితమైన దేశం ఐస్‌ల్యాండ్. ఒక్కసారి కాదు వరుసగా ఏడోసారి సురక్షిత దేశంగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నది. ఈ ఘనత సాధించడం ఐస్‌ల్యాండ్‌కు పదకొండవ సారి. ఓ ఆస్ట్రేలియన్ అధ్యయన సంస్థ ప్రపంచ దేశాల్లో ఉన్న స్థితిగతులు, అక్కడి ప్రభుత్వాల పాలన, పర్యావరణ పరిస్థితులు, ఇతర విషయాలను, విశేషాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను విడుదల చేసింది. తక్కవ క్రైమ్ రేటు, ఉగ్రవాదులదాడులు, హత్యలు, ఆయుధాల వ్యాపారం, అమ్మకాలు, వినియోగం, అవినీతి ఇలాంటివి ఏవీ అక్కడ కనిపించవు. 3.40 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో మిలటరీ వ్యవస్థ కూడా ఉండదు. ఆ అవసరమే రాదంటున్నారు అక్కడి వాస్తవ్యులు. ఇలాంటి ప్రత్యేకతలు ఉండడం వల్ల అది సురక్షిత దేశంగా మనగలుగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకం కూడా పెరుగుతున్నది. దీనివల్ల కొంత పర్యావరణానికి నష్టం ఉండే ప్రమాదమని తెలిసి పరిమితంగా పర్యాటకులను అనుమతిస్తున్నారు.

412
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles