సురక్షితం.. సుఖవంతం


Fri,April 26, 2019 12:52 AM

ఎండాకాలం, పైగా వృద్ధులు ప్రయాణం చేయడం అంటే ఆషామాషీ కాదు. చాలా జాగ్రత్తలు అవసరం. కొందరు వీల్ చెయిర్ లేకుండా కదల్లేరు. ఇంకొందరు కర్ర సాయం లేకుండా నిల్చోలేరు. మతిమరుపు, గుండెపోటు ఇలాంటి చాలా సమస్యలు వాళ్లను వెంటాడుతుంటాయి. కాబట్టి వాళ్లను ప్రయాణం చేయించేటప్పుడు ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.
Senior-Citizen
-వృద్ధులతో ప్రయాణం చేసేటప్పుడు ముందు ప్రణాళిక వేసుకొని బయలుదేరడం ఉత్తమం. వెళ్తున్న ప్రదేశం గురించి కొంత అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఏర్పాట్లు, వసతుల గురించి ముందే తెలుసుకుంటే ఉత్తమం.
-మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి గురించి ముందే ఆరా తీయండి. అవసరం అయితే ముందే చిన్న చిన్న మెడికల్ టెస్టులు చేయిస్తే మంచిది. ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రయాణంలో ఇబ్బందులు రావొచ్చు. ముందు డాక్టర్‌ను సంప్రదించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా సాగుతుంది. ముఖ్యంగా విమాన ప్రయాణం చేయాల్సి వస్తే హెల్త్ సర్టిఫికెట్ దగ్గర పెట్టుకోండి.
-తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అస్సలు ప్రయాణం చేయలేరు. కారణం వారికి నిద్ర అవసరం. ఒకప్పుడు ఉన్న శక్తి ఉండదు. వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అందుకే అనవసరపు అలసటకు గురిచేయకుండా మధ్యాహ్న వేళల్లో ప్రయాణం చేయించండి. అలసిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
-వయసు పైబడిన వారికి జీర్ణశక్తి అంతంతగానే ఉంటుంది. ఏదిపడితే అది తింటే కొందరికి పడదు. వాంతులు, విరేచనాలు అవొచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. మీరు వెళ్లే ప్రాంతంలో దొరికే ఆహారం గురించి ముందే తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఇంటి నుంచి తీసుకెళ్లడం ఇంకా మంచిది.
-ఇవి చిన్నవే అయినా చాలా ముఖ్యమైనవి. ఇలాంటివి పాటిస్తే అందమైన ప్రయాణం ఆనందాన్ని, అనుభూతినిస్తుంది.

149
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles