సుచరిత తీరొక్క దువ్వెనలు


Tue,February 19, 2019 01:33 AM

Sucharitha
దువ్వెన పుట్టుకకు వేల సంవత్స రాల చరిత్ర ఉన్నది. క్రీ.పూ. 5,500 సంవత్సరాల కిందట ప్రాచీన ఈజిప్టియన్లు తమ సంస్కృతిలో భాగంగా దువ్వెనలను వినియోగిం చినట్లు చరిత్రకారులు చెబుతు న్నారు. ప్రాచీన చైనాలోనూ సామా జిక హోదాకు చిహ్నంగా ప్రజలు వీటిని వాడేవారని తెలుస్తున్నది. అనాదిగా భారతదేశంతోసహా ప్రపంచంలోని అనేక దేశాలలో దువ్వెనల వాడకం జరిగింది. నాగరికతలో భాగంగా ప్రజలలో తలవెంట్రుకల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతున్నకొద్దీ పలు రకాల దువ్వెనల ఆవశ్యకత ఏర్పడింది. ఇవాళ్టికి వందలాది రకాల దువ్వెనలు అందుబాటులో ఉన్నాయి. తలవెంట్రుకల రకం, శైలి, అవసరాలనుబట్టి కూడా తీరొక్క దువ్వెనలు (దొడ్డు పళ్లు, సన్న పళ్లు, చిక్కులవి, పేండ్లవి) తయారు చేస్తున్నారు. 1930-40ల మధ్య ఫేషన్ రంగంలో వచ్చిన ఆధునాతన మార్పులు దువ్వెనల అభివృద్ధికీ దోహదపడ్డాయి. తొలితరం దువ్వెనలు ఏనుగు దంతాలు, తాబేలు గుల్లలతో తయారైనా, జంతుప్రేమికుల అభ్యంతరాలవల్ల తర్వాత నిలిచిపోయాయి. కలప, స్టీలు, బంగారం, ప్లాటినమ్ వంటివాటితో తయారయ్యే దువ్వెనలూ అనేకం. హెయిర్ కటింగ్ దుకాణాలు, బాత్‌రూమ్‌లలో ప్రత్యేకమైన దువ్వెనలను వాడతుంటారు. ఇక, ప్లాస్టిక్‌తో తయారవుతున్న దువ్వెనలకైతే కొదువ లేదు.

206
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles