సిలబస్ లేని పాఠశాల!


Wed,February 27, 2019 12:38 AM

స్కూల్ అంటే బ్యాగు, పుస్తకాలు, పరీక్షలు ఉంటాయనే తెలుసు. కానీ, ఈ స్కూల్ అలా కాదు. అక్కడ నో సిలబస్, నో పాఠాలు. కేవలం ఈ బడిలో వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తారు. ఆ స్కూల్లో అందరూ అమ్మాయిలనే తీసుకుంటారు.
school
ఈ స్కూల్ పేరు గుడ్ హార్వెస్ట్ స్కూల్. ఇది ఉత్తరప్రదేశ్, ఉన్నావో జిల్లాలోని పశ్చిమ గాన్‌లో ఉన్నది. పాఠశాలను 2016 సెప్టెంబర్‌లో ఆషితా, అనిష్ నాథ్ ప్రారంభించారు. ఈ స్కూల్‌లో అందరూ అమ్మాయిలే ఉండడం ఎంత ప్రత్యేకమో, అంతే ఆశ్చర్యం. ఆ గ్రామంలోని ప్రజలు వ్యవసాయాన్నే నమ్మేవారు. అనుకున్న దిగుబడి రాక నష్టపోయారు. ఆడపిల్లలను స్కూల్‌కి పంపించే స్థోమత లేక అమ్మాయిలని ఇంటికే పరిమితం చేశారు అక్కడి ప్రజలు. క్రిషి విజ్ఞాన్ కేంద్ర ద్వారా రైతులకు సాయం చేయాలనుకున్నాడు అనిష్. అలా మూడేండ్లు గడిచినా ఎటువంటి మార్పు రాలేదు. అందుకే అషితాను ఇందులో భాగస్వామ్యం చేయాలనుకున్నాడు. లక్నోలో ఉన్నప్పుడు అషితా స్కూల్లో పాఠాలు చేప్పేది. అవి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయంటుంది. ఇద్దరూ కలిసి చదువుకోలేని అమ్మాయిలకి వ్యవసాయ పాఠాలు నేర్పిస్తున్నారు. స్కూల్ స్థాపించి విద్యాబోధన మొదలుపెట్టారు. రెండున్నర యేండ్ల నుంచి 13 యేండ్లలోపు పిల్లలకు బోధిస్తారు.

పదిమంది పిల్లలకి ఇద్దరు టీచర్లు ఉన్నారు. వాళ్లెవరో కాదు.. అనిష్, ఆషితానే. పిల్లలందరినీ చుట్టూ కూర్చొబెట్టుకొని ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్ పాఠాలు ఆషితా చెబుతుంది. అగ్రికల్చర్ పాఠాలు చెప్పే బాధ్యత అనిష్‌దే. వీరికి కావాల్సిన పుస్తకాలు గూంజ్ ఎన్‌జీఓ సంస్థ అందజేస్తున్నది. వయసు పెరిగే కొద్ది కంప్యూటర్ మీద అవగాహన కల్పిస్తారు. వీరికి ప్రత్యేకంగా ఒక సిలబస్ అంటూ ఉండదు. పరీక్షలూ ఉండవు. లోక జ్ఞానం కలిగించి, వారికి వారు సంపాదించే దిశగా వీరి పాఠాలు ఉంటాయి. వారంలో ఐదు రోజులు స్కూల్ ఉంటుంది. పాఠాలతో పాటు గ్రామంలో వాడే కూరగాయలన్నింటినీ వీరే పండిస్తారు. పోయిన యేడాది లక్నోలో జరిగిన పుట్టగొడుగుల పెంపకం మీద జరిగే వర్క్‌షాప్‌నకి పిల్లల్ని తీసుకెళ్లారు. అది చూసిన పిల్లలు వీరి గ్రామంలో పుట్టగొడుగులని అభివృద్ధి చేశారు. విద్యార్థుల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వారికి బంగారు భవిష్యత్తుని అందిస్తున్న ఈ దంపతులకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

333
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles