సిద్ధమవుతున్నది దారి.. వెళ్దామా మరి!


Fri,April 26, 2019 12:53 AM

బ్యాగులు సర్దుకోండి.. బండి రెడీ చేయండి.. బయలుదేరడానికి. ఎక్కడికి అంటారా? థాయ్‌లాండ్. అదేమైనా పక్క రాష్ట్రమా? రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనే కదా మీ సందేహం. ఇలాంటి సందేహాలకు సమాధానం, సరికొత్త సదుపాయమే ఈ రోడ్డుమార్గం.
Thailand
అందమైన బీచ్‌లు, ప్రశాంతమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, చూపరులను ఆకట్టుకునే పర్యాటకం అంతా థాయ్‌లాండ్ సొంతం. ప్రశాంతత కోసం ఈ మధ్య కాలంలో చాలామంది ప్రకృతి ప్రేమికులు వెళ్లిన పర్యాటక ప్రదేశం కూడా థాయ్‌లాండ్. అలాంటి థాయ్‌లాండ్‌కు రోడ్డు మార్గంలో వెళ్లే అవకాశం వస్తున్నది. థాయ్‌లాండ్ టూరిజం అథారిటీ, భారత ప్రభుత్వం ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశం ఎక్కువ మంది పర్యాటకులు థాయ్‌లాండ్ ప్రతిఏడాది వెళ్తున్నారు. ఆ సంఖ్యను మరింత పెంచేందుకు ఇరువర్గాలు దీనికి అంగీకారం తెలిపాయి. భారత్‌కు థాయ్‌లాండ్ కలుపుతూ మయన్మార్ మీదుగా ఈ రోడ్డు మార్గం నిర్మితమవుతున్నది. మణిపూర్‌లోని మోరె నుంచి థాయ్‌లాండ్ సోట్ వరకు ప్రస్తుతానికి వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. 1,360 కిలోమీటర్లున్న ఈ హైవే 2020నాటికి అందుబాటులోకి రానున్నది. 2018లో 1.6 లక్షల మంది భారతీయులు థాయ్‌లాండ్ దేశాన్ని సందర్శించారని, ఆ దేశానికి వచ్చిన పర్యాటకుల్లో భారతీయులే 23 శాతమని థాయ్ టూరిజం అథారిటీ ప్రకటించింది. ఈ రోడ్డు మార్గం పనులు పూర్తయితే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్టు వారు చెప్తున్నారు.

2129
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles