సింగ్ ఈజ్ కింగ్


Fri,April 26, 2019 12:49 AM

రోడ్డుపై ప్రపంచాన్ని చుట్టేయడం సాధ్యమా? మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది. అవును.. అరవై ఏండ్ల వయసులో 131 రోజులు 36,800 కిలోమీటర్లు తిరిగాడు. ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటున్న అమర్‌జిత్ సింగ్ నిజంగా కింగ్.
AMARJITH-SING
ఢిల్లీకి చెందిన అరవై ఏండ్ల అమర్‌జిత్ సింగ్ చావ్లా వ్యాపారవేత్త. జీవితంలో అన్ని అనుభవాలను చూశాడు. ఇప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యం ప్రపంచాన్ని చుట్టేయడం. ఈ ఆలోచన నలభై ఏండ్ల క్రితం పుట్టింది. డెన్మార్క్‌కు చెందిన ఒక వ్యక్తిని కలిసినప్పుడు ప్రారంభమైన ఆశ ఇప్పటికీ ఎప్పటికీ తీరదు అంటున్నాడు. 2018 జూలై 7న న్యూఢిల్లీలో ప్రారంభమైన అమర్‌జిత్ సింగ్ చావ్లా ప్రయాణం విరామం, విశ్రాంతి లేకుండా కొనసాగుతున్నది. 131 రోజుల్లో దాదాపు 30 దేశాల్లో ఉన్న 150 నగరాలను చుట్టేశాడు. 36,800 కిలోమీటర్లు అయ్యాక చివరకు 2018 డిసెంబర్ 16న లండన్‌లో తన ప్రయాణానికి విరామం తీసుకున్నాడు. తన టయోటా ఫార్చునర్ వాహనంలోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ వాహనం మీద సుమారు 400 మంది విదేశీయులు తమ సందేశాలను రాశారు. ఫార్చునర్‌లో వెళ్లాడు కాబట్టి తనది సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం ఏమీ కాదు. మార్గ మధ్యలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు అమర్‌జిత్ సింగ్ మరో సాహసానికి సిద్ధమవుతున్నాడు. 18 నెలల్లో 2 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేయాలని సంకల్పించాడు. వయసుతో సంబంధం లేకుండా తన లక్ష్యం తనను నడిపించాలని, యువత దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాడు.

181
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles