సింగిల్ డే.. 550 సేల్


Sat,March 9, 2019 12:17 AM

-20 ఎకరాలు 1879 ఫ్లాట్లు
-11 బ్లాకులు - ఒక్కోటి 15 అంతస్తుల ఎత్తు
-2021 డిసెంబరు లోపు పూర్తి
-54 చదరపు అడుగుల్లోఆధునిక క్లబ్‌హౌజ్

ఒకే రోజు.. ఒకే ఒక్క ప్రాజెక్టు.. అది కూడా కొత్తదే.. కానీ, అమ్మిన ఫ్లాట్లేమో.. 550. అవును, అక్షరాల ఐదు వందల యాభై. ఇదేదో ముంబై, ఢిల్లీ, బెంగళూరులో జరిగిందనుకునేరు. మీరు నమ్మినా, నమ్మకున్నా.. అభివృద్ధిలో అద్భుతంగా దూసుకెళుతున్న హైదరాబాద్‌లో ఈ పోకడ ఇటీవల చోటు చేసుకుంది. 572 ఫ్లాట్లలో.. 550 ఫ్లాట్లు వేడిపకోడిల్లా అమ్ముడయ్యాయంటే.. ఆ సంస్థ పట్ల కొనుగోలుదారులకు గల నమ్మకం వల్లే సాధ్యమైంది. కాకపోతే, సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండి.. అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే.. భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రజలు భావించినప్పుడే ఇలాంటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని మర్చిపోవద్దు. హైదరాబాద్ నిర్మాణ రంగం దేదీప్యమానంగా వెలుగుతుందని.. భవిష్యత్తులో మరింత అభివృద్ధిలోకి దూసుకెళుతుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి!!
12Final-Render
-ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రియల్ రంగం కునారిల్లుతున్నది. అమ్మకాల్లేక విలవిలలాడుతున్నది. పలు నగరాల్లో నిన్నటివరకూ ఒక వెలుగు వెలిగిన బడా సంస్థల ఎండీలు సైతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా నగరాల్లో ఫ్లాట్ల అమ్మకాల్లేక ఇబ్బంది పడుతున్నారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ రియల్ మార్కెట్ కకావికలమైంది. కానీ, వీటన్నింటి కంటే భిన్నంగా హైదరాబాద్ నిర్మాణ రంగం మాత్రం.. మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళుతున్నది. జీఎస్టీ వల్ల స్పష్టత రాకపోవడంతో మధ్యలో కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడా సమస్య కూడా తీరిపోయింది. నిర్మాణ రంగంపై ఐదు శాతం జీఎస్టీ వచ్చే నెల ఒకటో తేది నుంచి అమల్లోకి వస్తుంది. సరిగ్గా, ఇలాంటి తరుణంలో మై హోమ్ సంస్థ కొండాపూర్‌లో ఇరవై ఎకరాల్లో మై హోమ్ మంగళ ప్రాజెక్టును ప్రారంభించింది. దీంతో, 96 శాతం ఫ్లాట్లన్నీ మొదటి రోజే అమ్ముడయ్యాయి. వాస్తవానికి, మరే ఇతర నిర్మాణ సంస్థకైనా.. 550 ఫ్లాట్లను అమ్మడానికి కనీసం రెండు నుంచి మూడేండ్లు పట్టేది. అలాంటిది, మైహోమ్ సంస్థ ఒకే రోజులో విక్రయించిందంటే.. ఆ సంస్థ పట్ల కొనుగోలుదారుల్లో ఉన్న నమ్మకమూ ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు.

మంగళారతులు..

మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రారంభించిన మై హోమ్ మంగళకు కొనుగోలుదారులు నీరాజనాలు పలకడానికి అనేక కారణాలున్నాయి. తెలంగాణ రెరా అథారిటీ నుంచి అనుమతి పొందిన ఈ ప్రాజెక్టు.. అటు మాదాపూర్ ఇటు గచ్చిబౌలికి నడిమధ్యలో నిర్మితమవుతున్నది. పౌర సదుపాయాలన్నీ చేరువలోనే ఉన్నాయి. సమీపంలోనే స్కూళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు వంటివి ఉన్నాయి. పైగా, ప్రాజెక్టు వచ్చేది ఇరవై ఎకరాల విస్తీర్ణంలో. పదకొండు బ్లాకుల్లో ఒక్కోటి పదిహేను అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. 1879. ప్రతి బ్లాకుకో ఎంట్రీ లాంజీతో పాటు లాబీ, ఇండోర్ గేమ్స్‌ను పొందుపరిచారు. ప్రాజెక్టు డిజైన్ ప్రతిఒక్కరినీ విశేషంగా ఆకర్షించింది. ఎందుకంటే, నిర్మాణ స్థలం వచ్చేది కేవలం 23 శాతంస్థలంలోనే! మిగతా స్థలంలో.. తివాచీపర్చిన పచ్చదనం, ఆధునిక సదుపాయాల కోసం కేటాయించారు.

54 వేల చదరపు అడుగుల్లో క్లబ్‌హౌజ్..

మై హోమ్ మంగళ ప్రత్యేకత ఏమిటంటే.. 54 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దొరకని ఆధునిక సదుపాయమంటూ లేదని చెప్పాలి. స్విమ్మింగ్ పూల్, జిమ్, స్కాష్ కోర్టులు, బ్యాడ్మింటన్ కోర్టులు వంటివి పొందుపరుస్తారు. నివాసితులకు అవసరమయ్యే ఏటీఎం, గ్రాసరీ స్టోర్, ఫుడ్ కోర్టులు, క్రెష్, స్పా, సెలూన్‌లకు స్థానం కల్పిస్తారు. మొత్తానికి, ఈ ప్రాజెక్టును 2021 డిసెంబరులోపు పూర్తి చేయడానికి మై హోమ్ ప్రణాళికల్ని రచించింది.

దేశంలోనే రికార్డు..

మై హోమ్ ప్రాజెక్టులంటే బయ్యర్లకు ఎంతో నమ్మకం. నిర్ణీత గడువులోపే ఫ్లాట్లను అందజేస్తాం. గత మూడు దశాబ్దాలకు పైగా మేం చెప్పిన నిర్మాణాల్లో కొనుగోలుదారులెంతో సంతోషంగా ఉన్నారు. అందుకే, మా ప్రతి ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. మై హోమ్ మంగళను ప్రారంభిస్తున్నామని ప్రకటించగానే.. ఒకే రోజు వెయ్యి మంది సందర్శించారు. అందులో 550 మంది అప్పటికప్పుడే ఫ్లాట్లను బుక్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదో సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. యావత్ భారతదేశంలో.. కొనుగోలుదారుల నమ్మకాన్ని చూరగొన్న అతికొద్ది నిర్మాణ సంస్థల్లో మా సంస్థ ఉండటం మాకెంతో గర్వకారణం.

- శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్- మార్కెటింగ్, మైహోమ్ కన్‌స్ట్రక్షన్స్

322
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles