సింకు శుభ్రంగా ఉందా?


Sat,March 9, 2019 12:38 AM

సాధారణంగా వంటింట్లో సింకు ఉంటుంది. కానీ బ్యాక్టీరియా అంతా అక్కడే ఉంటుందన్న విషయం మీకు తెలుసా? ఒక రోజు శుభ్రం చేయకపోయినా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తెలుసా? సింకుని శుభ్రపరుచడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోండి.
sink
-సింకుల్లో గిన్నెలు కడిగేశాక హమ్మయ్యా ఓ పనైపోయింది అనుకుని వేరే పనిపై దృష్టిపెడతారు. సింక్‌ను శుభ్రపర్చకపోతే బ్యాక్టీరియా చేరుతుంది. గిన్నెలు కడిగిన ప్రతిసారీ సింకును సబ్బుతో కడగడం మంచిది.
-సింకులో రోగకారక క్రిములు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చికెన్, కూరగాయలు, గిన్నెలు కడగడం పూర్తయిన తర్వాత సింకులో యాంటీబ్యాక్టీరియల్ స్ప్రే చల్లడం మంచిది.
-వీలైనంత వరకు సింకు పొడిగా ఉండేలా చూసుకుంటే బెటర్. సింకులో బొద్దింకలు, ఈగలు చేరే అవకాశం ఉంటుంది. కొందరు సింకును చెత్త కుండీలా కూడా వాడుతుంటారు. చెత్తనంతా తీసుకొచ్చి సింకులో వేస్తారు. ఇలా చేస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
-సింకుతో పని అయ్యాక సబ్బుతో శుభ్రపరుచాలి. తర్వాత కాస్త వెనిగర్‌ని సింకు చుట్టూ చల్లాలి. పది నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే సింకు శుభ్రంగా ఉండడంతో పాటు నిగనిగలాడుతుంది.
-సింకు చుట్టూ బొద్దింకలు తిరుగుతున్నాయా? అయితే వెల్లుల్ని నలిపి సింకు దగ్గర పెట్టండి. వెల్లులి వాసనకి పురుగులు, బొద్దింకలు రాకుండా ఉంటాయి.

392
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles