సాహసాల కెప్టెన్


Fri,May 17, 2019 12:38 AM

ఏవియేషన్‌లో డిగ్రీ చేసిన ఆమె అందరిలా విమానయాన ఉద్యోగంలో చేరలేదు. ఎందుకంటే ఆమెకు చిన్నప్పటి నుంచి సాహసాలంటే ఇష్టం. అందుకే ఏవియేషన్ విద్య నేర్చుకుంది. తర్వాత సాహస యాత్ర చేసి రికార్డు సృష్టించింది. ఆమెనే ముంబైకి చెందిన కెప్టెన్ అరోహి పండిత్.
arohi
ఏవియేషన్ విద్యను అభ్యసించిన చాలామంది ఆయా ఉద్యోగాల్లో స్థిరపడతారు. కానీ అరోహి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. ప్రత్యేకమైన శిక్షణ తీసుకొని సాహసాలకు దిగుతున్నది. ఇటీవలే అట్లాంటిక్ మహాసముద్రంపై ఓ చిన్న విమానంలో ప్రయాణించి రికార్డు సృష్టించింది. స్కాట్‌లాండ్ నుంచి ప్రారంభమైన ఆమె విమాన ప్రయాణం అట్లాంటిక్ మహాసముద్రం పైన మూడువేల కిలోమీటర్లు సాగింది. ఇలా ఒంటరిగా ప్రయాణించి కెనడాలోని ఇక్విలాట్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దీంతో అట్లాంటిక్ మహాసముద్రం మీద సోలో ైఫ్లెట్‌లో ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. ఇలా విమానాల్లో ఒంటరి ప్రయాణం చేస్తూ సాహసాలు చేయడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నది. మళ్లీ ఇప్పుడు కెనడా నుంచి రష్యా వైపు ప్రయాణించనున్నది. సుమారు 37వేల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి భారతదేశంలోకి చేరుకోనున్నది. గాలిలో ఎగరాలనీ, విమానాలను నడపాలని అరోహికి చిన్నప్పటి నుంచీ ఉన్న కల. అందుకే ఏవియేషన్‌లో డిగ్రీ చేసింది. తర్వాత ఆమె సాహసాలకు దిగాలనుకుంది. మొదట ముంబైలోని ఏవియేషన్ క్లబ్‌లో చేరింది. అక్కడే ప్రత్యేకమైన శిక్షణలు తీసుకొని ఇలా సాహస యాత్రలతో ముందుకు సాగుతున్నది.

176
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles