సాహసాలే ఊపిరిగా..


Tue,March 12, 2019 01:27 AM

first-stunt-woman
సినిమాల్లో ఫైట్ సీన్లు చిత్రీకరించడానికి తెరవెనుక ఎంతోమంది స్టంట్ మాస్టర్ల శ్రమ దాగి ఉన్నది. దేశంలోనే మొట్టమొదటి మహిళా స్టంట్ మాస్టర్‌గా రేష్మా పటాన్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నది. ఆమె జీవిత చరిత్రను ఇప్పుడు జీ వెబ్

సిరీస్‌లో ద షోలే గర్ల్ పేరుతో బయోపిక్‌ను తీసుకురానున్నారు.


మగాళ్లు కూడా చేయలేని స్టంట్లు చేసి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకే రేష్మ వన్నెతెచ్చింది. అత్యంత సాహసోపేతమైన సన్నివేశాలలో డూప్‌గా, స్టంట్ మాస్టర్‌గా నటించిన రేష్మా పటాన్ మూడు దశాబ్దాలపాటు 400 చిత్రాలకు పైగా పనిచేసింది. మీనాకుమారి,

సైరాబాను, హేమమాలిని, శ్రీదేవి, డింపుల్ కపాడియా, మీనాక్షి శేషాద్రి వంటి సీనియర్ నటీమణులెందరికో డూప్‌గా నటించింది. ఇప్పుడు 62ఏళ్ల వయసులో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్త్తున్న రేష్మ చిన్నప్పుడు వాళ్లు ఉండే ప్రాంతంలో ఎంతోమంది

టాంగావాలాలు ఉండేవాళ్లు. ఆ టాంగాల్లో ఒక్కతే కూర్చొని చాలా దూరం వెళ్లిపోయేది. అట్లా చిన్నతనంలోనే టాంగా నడపడం అలవాటయ్యింది. వాళ్లకు ఓ షాప్ ఉండేది. కుటుంబ పోషణ కోసం పనిచేసేంత పెద్ద వయసు కూడా కాదు. అయితే సినిమాల్లో

యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకాయన రేష్మను సినిమాల్లో డూప్‌గా పనిచేయడానికి పంపించమని కోరాడు. మొదట నిరాకరించినా తరువాత 1968లో అంగీకరించాడు ఆమె తండ్రి. 14 యేండ్ల వయసులో రేష్మ

మొట్టమొదటిసారి డూప్‌గా నటించేందుకు సిద్ధమైంది. ఏక్ ఖిలాడీ బవన్ పట్టే సినిమాలో లక్ష్మిఛాయ పాత్రకు డూప్‌గా పనిచేసింది. ఒంటికి అతుక్కుపోయేదుస్తుల్లో చేయలేక హీరోయిన్ ఇబ్బంది పడింది.


ఆ సీన్ ఒకే ఒక టేక్‌లో పర్ఫెక్ట్‌గా చేసింది రేష్మ. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తనకు అత్యంత ఇష్టమైన అత్యంత బాధ కలిగించిన ఎప్పటికీ గుర్తుండిపోయిన జ్ఞాపకాలు అంటే షోలే (1975)లో వచ్చిన చిత్రంలోవే. ఆమెను తీవ్ర

గాయాలపాలు జేసిన మరో సినిమా షూటింగ్ కర్జ్ (1980). దుర్గా కోఠేకి డూప్‌గా చేస్తున్న సమయంలో దూసుకువస్తున్న ట్రక్కు ఎదురుగా దారిలో ఉండాలి. అది ఆమెను ఢీ కొట్టేలోపే పక్కకు దూకేయాలి. అయితే ఆమె అనుకున్న దానికన్నా సీన్ చాలా

బాగా వచ్చింది. కాకపోతే ట్రక్కు వచ్చి ఆమెను ఢీకొట్టింది. రేష్మ వెళ్లి ఒక కొండకు గుద్దుకుంది. తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్రమైన రక్తస్రావం అయింది. ఆ చావు నుంచి తప్పించుకొని బయటపడ్డ ఆమె ఇప్పటికీ సినిమానే నమ్ముకున్నది. 30

యేండ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఆమె కథను ఇప్పుడు బయోపిక్ రూపంలో తీసుకొచ్చారు.

449
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles